అఖిల్‌ కోసం బాలీవుడ్‌ విలన్‌!

Tuesday, February 10, 2026
అక్కినేని యంగ్ హీరో అఖిల్ ప్రస్తుతం తన కొత్త చిత్రాన్ని తీర్చిదిద్దడంలో ఫుల్‌ బిజీగా ఉన్నాడు. ‘ఏజెంట్’ డిజాస్టర్ తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న అఖిల్, ప్రస్తుతం మురళీకృష్ణ అబ్బూరి డైరెక్టర్లో  తన నెక్స్ట్ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ రీసెంట్‌గా స్టార్ట్ అయినట్లు సినీ సర్కిల్స్‌లో వార్తలు వినపడుతున్నాయి.

ఇక ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో షికారు చేస్తోంది. ఈ సినిమాలో అఖిల్ పాత్రను పవర్‌ఫుల్‌గా డిజైన్ చేశాడట డైరెక్టర్‌. కాగా, ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు ప్రతీక్ గాంధీ విలన్ పాత్రలో నటించేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వినపడుతున్నాయి.

‘1992 స్కామ్’తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రతీక్ గాంధీ. ఈ సినిమాలో విలన్ పాత్ర కూడా పవర్‌ఫుల్‌గా ఉంటుందని సమాచారం. దీంతో ప్రతీక్ గాంధీ అయితే తెలుగు ప్రేక్షకులకు సరికొత్తగా ఉంటుందని మేకర్స్ అనుకుంటున్నారంట. మరి ఈ సినిమాలో నిజంగా ప్రతీక్ గాంధీ నటిస్తున్నాడా.. అనేది అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles