సాలిడ్‌ హైప్‌ వచ్చేసింది!

Tuesday, January 7, 2025

సాలిడ్‌ హైప్‌ వచ్చేసింది! నందమూరి నటసింహం బాలయ్య బాబు హీరోగా డైరెక్టర్‌ కొల్లి బాబీ తో చేస్తున్న తాజా భారీ సినిమా “డాకు మహారాజ్” . మరి ఎన్నో అంచనాలు నడుమ విడుదలకి వస్తున్న ఈ సినిమా ఒక్కో పాటతో ఇతర ప్రమోషనల్ కంటెంట్ తో మరింత హైప్ పెంచేసుకుంటుంది. అయితే ఈ సంక్రాంతిలో వస్తున్నా మరో సినిమా ఇది కాగా ఆల్రెడీ గేమ్ ఛేంజర్ ట్రైలర్‌ హిట్ అయ్యింది.

ఇక నెక్స్ట్ డాకు మహారాజ్ ట్రైలర్ రాబోతుంది. ఇది రేపు రాబోతున్నట్టుగా టాక్ వినపడుతుంది. ఈ ట్రైలర్ పై కూడా మంచి హైప్‌ నెలకొంది. మెయిన్ గా మేకర్స్ తమ కంటెంట్ మీదే ఎక్కువ నమ్మకంగా ఉన్నారు. దీంతో డాకు మహారాజ్ ట్రైలర్ కూడా అందరికీ నచ్చుతుందని టాక్. ఇక ఈ మూవీకి కూడా థమన్ సంగీతం అందిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ అలాగే ఫార్చూన్ ఫోర్ సినిమాస్ వారు కూడా నిర్మాణ బాధ్యతలు చేపట్టారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles