“విశ్వంభర”పై అదిరిపోయే అప్డేట్‌ ఇదే!

Tuesday, January 7, 2025

టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా,  త్రిష హీరోయిన్ గా యంగ్‌ అండ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్  వశిష్ట తెరకెక్కిస్తున్నమోస్ట్‌ అవైటెడ్ మూవీ “విశ్వంభర”.  అయితే అన్నీ సరిగ్గా సెట్ అయి ఉంటే ఈ జనవరి 10న విశ్వంభర హంగామా ఓ రేంజ్ లో ఉండేదని తెలిసిన విషయమే. అయితే ఈ సినిమా టీజర్ విడుదలైన తర్వాత వచ్చిన మిక్స్డ్ రెస్పాన్స్ తో మేకర్స్ కొంచెం వెనకడుగు వేశారు.

మెయిన్ గా వి ఎఫ్ ఎక్స్ పరంగా వచ్చిన కామెంట్ల గురించి సరైన జాగ్రత్తలు ఇపుడు తీసుకుంటున్నారట. ఇలా ప్రస్తుతం గతంలో వర్క్ చేసిన గ్రాఫికల్ టీం ని తీసి కొత్త టీం ని ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తుంది. దీంతో కొంచెం బెటర్ గా విజువల్స్ ని వీరు అందిస్తారని మేకర్స్ అనుకుంటున్నారంట. నిజానికి టీజర్ లో మరీ అంత నెగిటివ్ చేసే రేంజ్ లో విజువల్స్ లేవు.

కానీ సోషల్ మీడియాలో జరిగిన నెగిటివిటీకి మేకర్స్ ఎలాంటి రిస్క్‌ తీసుకోకుండా ముందే మార్పులు చేర్పులు చేస్తున్నారని సమాచారం. ఇక ఈ సినిమాకి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణ బాధ్యతలు చేపట్టారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles