నన్ను క్షమించండి అంటూ రాఖీ భాయ్‌ లేఖ!

Sunday, January 5, 2025

కన్నడ హీరో యశ్ ప్రస్తుతం తన తరువాత సినిమా ‘టాక్సిక్’ను తెరకెక్కిస్తున్నాడు. ‘కేజీయఫ్’ చిత్రాలతో పాన్ ఇండియా స్టార్‌గా యశ్ తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. ఇక ఇప్పుడు మరోసారి ‘టాక్సిక్’ చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్దమవుతున్నాడు.

అయితే, తాజాగా యశ్ తన అభిమానులకు ఓ లేఖను రాశాడు. ‘తన అభిమానులు తనపై కురిపిస్తున్న ప్రేమకు ఎల్లప్పుడు కృతజ్ఞుడిని. గత కొన్నేళ్లుగా అభిమానులు తన పుట్టినరోజును గ్రాండ్‌గా సెలబ్రేట్ చేయాలని అనుకుంటున్నా.రు. కానీ, కొన్ని అనుకోని ఘటనలను తనను తీవ్రంగా కలిచివేశాయి.. అందుకే తాను ఇలాంటి వేడుకలకు దూరంగా ఉంటున్నానని.. ఇకపై కూడా తన అభిమానుల క్షేమమే తనకు ముఖ్యమని.. తన పుట్టిన రోజున తాను సినిమా షూటింగ్‌లో బిజీగా ఉంటానని..’ యశ్ తన లేఖలో చెప్పుకొచ్చాడు.

అభిమానులు అందించే శుభాకాంక్షలు,ఆశీస్సులు తనకు ఎల్లప్పుడు చేరుతాయని.. అవి మాత్రమే తనకు సంతోషాన్ని అందిస్తాయని యశ్ ఈ సందర్భంగా తెలిపాడు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles