గేమ్‌ మొదలు పెట్టడానికి రెడీఅయిన దిల్‌రాజు!

Saturday, January 4, 2025

గేమ్‌ మొదలు పెట్టడానికి రెడీఅయిన దిల్‌రాజు! ‘గేమ్ ఛేంజర్’ కోసం ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ తో నిర్మాత దిల్‌ రాజు సమావేశమయ్యారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పవన్‌ను దిల్ రాజు కలిశారు.ఈ సందర్భంగా ఆయన రామ్‌ చరణ్‌ కొత్త సినిమా ‘గేమ్‌ ఛేంజర్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను ఏపీలో నిర్వహించాలని తాము భావిస్తున్నట్లు చెప్పారు.

అలాగే, ఈ ఈవెంట్ కి ముఖ్యఅతిథిగా హాజరుకావాలని పవన్‌ ను దిల్ రాజు అడిగారు. పవన్ కూడా ఈ ఈవెంట్ కి రావడానికి ఒప్పుకున్నట్లు టాక్‌ వినపడుతుంది. అనంతరం సినీ పరిశ్రమ అభివృద్ధి గురించి దిల్ రాజు – పవన్ చర్చించుకున్నారు. కాగా సంక్రాంతి కానుకగా జనవరి 10న ‘గేమ్‌ ఛేంజర్‌’ ప్రేక్షకుల ముందుకురానుంది. చరణ్ – స్టార్ డైరెక్టర్‌ శంకర్ కాంబోలో రాబోతున్న ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ లో కియారా అద్వానీ హీరోయిన్‌ గా చేసింది.

ఈ పొలిటికల్ డ్రామా పై మెగా ఫ్యాన్స్ కి ఇప్పటికే విపరీతమైన అంచనాలు పెంచుకున్నారు. ఈ మూవీకి తమన్‌ స్వరాలు సమకూర్చారు. ఎస్‌జే సూర్య, శ్రీకాంత్‌, అంజలి, సునీల్‌, ప్రకాశ్‌రాజ్‌, జయరామ్‌ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ‘గేమ్‌ ఛేంజర్‌’ విడుదల అవుతుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles