సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ నటించిన తాజా సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు పెంచేసిన విషయం తెలిసిందే. ఈ మూవీని డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తుండడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటివరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌కు ట్రెమెండస్ రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాపై సర్వత్రా పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అవుతున్నాయి.
తాజాగా ఈ సినిమా నుంచి ‘బ్లాక్‌బస్టర్ పొంగల్’ సాంగ్‌ను మేకర్స్ ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చారు. ముందునుంచీ ఈ పాటపై హైప్ క్రియేట్ చేయడంలో చిత్ర యూనిట్ విజయం సాధించింది. ఇక వారు ఈ పాటపై ఎందుకంత ధీమాగా ఉన్నారో ఇప్పుడు ఈ సాంగ్ చూస్తే అర్థమవుతుంది. పక్కా పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చే విధంగా ఈ పాట ఉండటంతో ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతున్నారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఈ పాట అదిరిపోయే రేంజ్ లో ఆకట్టుకుంది.
ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరితో వెంకీ మామ చేసే అల్లరి ఈ పాటలో చిత్ర బృందం చూపించింది. ఇక భీమ్స్ ఈ పాటను కూడా అదిరిపోయే ట్యూన్‌తో కంపోజ్ చేశాడు. ఈ పాటను భీమ్స్, రోహిణి సొరట్, వెంకటేష్ కలిసి ఆలపించారు. ఈ పాట కూడా ఇన్‌స్టంట్ చార్ట్‌బస్టర్‌గా నిలుస్తుందని తెలుస్తుంది.