బెనిఫిట్‌ షోలు ముఖ్యం కాదు!

Friday, December 27, 2024

తెలుగు సినిమా ఇండస్ట్రీ నేడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు నేతృత్వంలో జరగగా, సినిమా ఇండస్ట్రీ నుండి 36 మంది సభ్యులు ఈ భేటీలో సమావేశమయ్యారు. ఇక ఈ భేటీ అనంతరం దిల్ రాజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు.

సినిమా ఇండస్ట్రీకి సీఎం రేవంత్ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని చెప్పారని.. అయితే, హైదరాబాద్‌ను ప్రపంచస్థాయిలో ఎంటర్‌టైనింగ్ హబ్‌గా తీసుకెళ్లేందుకు అందరూ కృషి చేయాలని సీఎం సూచించారని దిల్ రాజు చెప్పారు. ఇప్పుడు టికెట్ రేట్లు, బెనిఫిట్ షోలకు సంబంధించిన చర్చ జరగలేదని.. అది చాలా చిన్న విషయమని.. ఇండస్ట్రీ గ్రోత్ అనేది ముఖ్యమని సీఎం అన్నట్లు  దిల్ రాజు పేర్కొన్నారు.

దీంతో ఇక తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు, బెనిఫిట్ షోలు ఉండవు అనేది మరోసారి స్పష్టం అయ్యింది. ఇంకోసారి సినీ పరిశ్రమ మీటింగ్ పెట్టి, తమ సమస్యలను సీఎంకు చెబుతామని దిల్‌ రాజు అన్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles