అంత అహంకారంతో గుడ్డిగా దోచుకున్నారా?

Wednesday, December 25, 2024

జగన్ హయాంలో ప్రభుత్వం సొమ్మును ఎన్నిరకాలుగా దోచుకున్నారో ఇంకా ఒక్కటొక్కటిగా వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. జగన్ అండ చూసుకుని అడ్డగోలుగా చెలరేగిపోయినందుకు సస్పెండ్ అయి ఉన్న మరో ఐపీఎస్ అధికారి సంజయ్ పై ఇప్పుడు ఏసీబీ కేసు నమోదు అయింది. ప్రభుత్వ ఖజానాకు రెండు కోట్ల రూపాయలు నష్టం కలిగించారు.

అనే ఆరోపణలపై ఆయన మీద అవినీతి కేసులు నమోదు అయ్యాయి. ఎన్.సంజయ్ సీఐడీ చీఫ్ గా రావడానికి ముందు అగ్నిమాపక శాఖ డీజీగా ఉండేవారు. అప్పట్లో ఆ శాఖలో ఆయన దందా విచ్చలవిడిగా సాగింది. డొల్ల కంపెనీలు అనే సంగతి కాగితాలు చూస్తే స్పష్టంగా అర్థమయ్యే పరిస్థితుల్లో రెండు కంపెనీలకు ఎలాంటి పనులు చేయకుండానే డబ్బులు దోచిపెట్టిన ఘనత ఆయనది. ఈ వివరాలేమిటో తెలిస్తే విస్తుపోవాల్సిందే.

అగ్నిమాపక శాఖలో ఎన్వోసీలు ఆన్ లైన్ లో జారీచేసేందుకు ఒక వెబ్సైట్, మొబైల్ యాప్ డెవలప్మెంట్, మెయింటెనెన్స్, 150 ట్యాబ్ ల సరఫరా కాంట్రాక్టును సౌత్రికా టెక్నాలజీస్ అనే సంస్థకు కట్టబెట్టారు. ఏ పనులు చేయకుండానే ఆ సంస్థకు దాదాపు 60 లక్షల రూపాయల బిల్లులు చెల్లించేశారు. అలాగే సీఐడీ తరఫున ఎస్సీ ఎస్టీ ఎట్రాసిటీ నిరోధక చట్టంపై అవగాహన సదస్సులు నిర్వహించే కాంట్రాక్టును క్రిత్వ్యాప్ టెక్నాలజీస్ అనే సంస్థకు అప్పగించారు. నిజానికి ఆ సంస్థ చేసిందేం లేదు.అవగాహన సదస్సులన్నీ ఏసీబీ అధికారులే నిర్వహించారు.కానీ క్రిత్య్వాప్ కు మాత్రం ఏకంగా 1.19 కోట్ల రూపాయలు ఇచ్చేశారు.

ఈ వ్యవహారాల్లో ట్విస్టు ఏంటంటే.. ఎన్.సంజయ్ రెండు సంస్థల ముసుగులో అగ్నిమాపక శాఖ నుంచి, ఏసీబీ నుంచి దొంగచాటుగా పనులు కట్టబెట్టినట్టుగా రంగుపులిమి డబ్బు కాజేయాలని అనుకున్నారు. అయితే ఆ రెండు  సంస్థలు ఒకే చిరునామాతో రిజిస్టరు అయి ఉన్నాయి. వాటిలో ఒకటి డొల్ల కంపెనీ అని.. విచారణ్ జరిపిన విజిలెన్స్ వారు తేల్చారు.

జగన్మోహన్ ఱెడ్డి హయాంలో ఎంత విచ్చలవిడిగా చెలరేగిపోయారో.. డొల్లకంపెనీలతో దోచుకోదలచుకున్న వారు.. కనీసం అడ్రసు కూడా మార్చకుండా ఎంత నిర్లక్ష్యంగా ఉంటూ దోచుకున్నారో తెలుసుకోవడానికి ఇది పెద్ద ఉదాహరణ అని అంతా అనుకుంటున్నారు. వైసీపీ పెద్దల అండ ఉంటే తమను ఎవరేం చేస్తారనే అహంకారంతోనే ఇంత దారుణంగా వ్యవహరించినట్టుగా అర్థమవుతోంది.

ఈ దోపిడీ పర్వానికి ఇప్పుడు ఎన్.సంజయ్ ఏ1 గా ఆ రెండు సంస్థలు తర్వాతి నిందితులుగా కేసు నమోదు అయింది. ఆ కంపెనీల ఖాతాలనుంచి ఎవరు డ్రా చేశారు.. అంతిమ లబ్ధిదారు ఎవరు అనేది కూడా లెక్కతేల్చబోతున్నట్టుగా తెలుస్తోంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles