టాలీవుడ్ యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరోస్ లో తనదైన మార్క్ ఇంట్రెస్టింగ్ సినిమాలతో అలరిస్తున్న యువ హీరో నిఖిల్ సిద్ధార్థ్ కూడా ఒకడు. ఇపుడు కూడా పలు ఆసక్తికర కథలతో భారీ ప్రాజెక్ట్ లు తాను చేస్తుండగా ఈ సినిమాల్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నుంచి అనౌన్స్ అయ్యిన చిత్రం “ది ఇండియా హౌస్” సినిమా కూడా ఒకటి.
మరి ఓ సాలిడ్ స్పై థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తుండగా ఈ సినిమాలో హీరోయిన్ గా యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ సాయి మంజ్రేకర్ ఈ చిత్రంలో నటిస్తుండగా నేడు తన పుట్టిన రోజు కానుకగా మేకర్స్ ఆమె బర్త్ డే పోస్టర్ సహా తన రోల్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.
అయితే ఈ చిత్రంలో ఆమె ‘సతీ’ గా కనిపిస్తుంది అని ఆమెపై ఒక బ్యూటిఫుల్ పోస్టర్ తో చెప్పారు. మరి సినిమాలో తన పెర్ఫామెన్స్ ఎలా ఉంటుందో చూడాలి.