సూపర్ స్టార్ రజినీకాంత్ పుట్టినరోజు సందర్భంగా ఇండియా వైడ్ గా సినీ సహా రాజకీయ ప్రముఖులు కూడా శుభాకాంక్షలు చెప్పారు. మరి ఈ క్రమంలోనే తన అవైటెడ్ చిత్రం “కూలీ” నుంచి దర్శకుడు లోకేష్ కనగరాజ్ అండ్ టీం మంచి ట్రీట్ తో కూడిన ఓ సాంగ్ బిట్ ని కూడా విడుదల చేశారు. దీంతో ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. మరి ఈ క్రమంలో ఓ యంగ్ హీరో అయితే స్పెషల్ పిక్ పోస్ట్ చేసి సూపర్ స్టార్ కి తనదైన శైలిలో శుభాకాంక్షలు తెలియజేశాడు.
మరి ఆ హీరోనే ఇపుడు రజినీకాంత్ తో కూలీ సినిమా చేస్తున్న దర్శకుడు లోకేష్ కనగరాజ్ ని పరిచయం చేసిన యంగ్ హీరో సందీప్ కిషన్. సోషల్ మీడియాలో రజినీకాంత్ తో కలిసి ఉన్న పిక్ ని షేర్ చేసుకొని జన్మదిన శుభాకాంక్షలు తెలిపాడు.
మరి ఇందులో సూపర్ స్టార్ తో కలిసి అటు సందీప్ కూడా చాలా సింపుల్ లుక్స్ లో కనిపిస్తుండగా లోకేష్ కనగరాజ్ విషయంలో గర్వంగా ఉంది అంటూ సందీప్ సంతోషం వ్యక్తం చేసాడు. దీంతో వీరి పిక్ ఇపుడు వైరల్ గా మారింది. మరి ఈ యంగ్ హీరో ప్రస్తుతం “మజాకా” సినిమా చేస్తున్నాడు.