Breaking: అల్లు అర్జున్‌ అరెస్ట్‌!

Saturday, January 18, 2025

జాతీయ నటుడు అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ‘పుష్ప-2’ సినిమా బెనిఫిట్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్ కు అల్లు అర్జున్‌ తన కుటుంబంతో కలిసి  వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందారు. దీనికి సంబంధించి అల్లు అర్జున్ పై కేసు నమోదయిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ ను అదుపులోకి తీసుకుని అరెస్ట్‌ చేశారు. దాదాపు 20 మంది పోలీసులు అల్లు అర్జున్ నివాసానికి వెళ్లారు. హైదరాబాద్ లోని ఆయన నివాసం నుంచి బన్నీని పోలీసులు తమ వాహనంలో పీఎస్ కు తీసుకెళ్లారు. అల్లు అర్జున్ పోలీసుల వాహనంలోకి ఎక్కారు. ఈ కేసులో అల్లు అర్జున్ ఏ2గా ఉన్నారు.

ఎఫ్ఐఆర్ లో నమోదు చేసిన సెక్షన్ల ప్రకారం స్టేషన్ బెయిల్ మంజూరు చేసే అవకాశం లేదని తెలుస్తోంది. ఈ సెక్షన్ల ప్రకారం నేరం రుజువైతే గరిష్ఠంగా 10 ఏళ్ల వరకు శిక్ష పడే అవకాశాలున్నాయి. మరోవైపు, కేసును కొట్టివేయాలని కోరుతూ అల్లు అర్జున్ హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే హైకోర్టులో బన్నీకి ఊరట లభించలేదు. ఇదే ఘటనలో సంధ్య థియేటర్ పై కూడా కేసు నమోదు చేశారు. థియేటర్ మేనేజర్, మరో సిబ్బంది ఇప్పటికే జైలుకు వెళ్లారు. బన్నీని పోలీసులు కోర్టు ముందు హాజరుపరిచే అవకాశం ఉంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles