జాతీయ నటుడు అల్లు అర్జున్ హీరోగా నటించిన తాజా భారీ హిట్ సినిమా “పుష్ప 2 ది రూల్”. డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ అవైటెడ్ సీక్వెల్ రికార్డు వసూళ్లు కొల్లగొట్టి ఇండియన్ సినిమా దగ్గర ఫాస్టెస్ట్ 1000 కోట్ల గ్రాసింగ్ సినిమాగా నిలుచుంది. అయితే ఈ సినిమా అందుకున్న ఈ భారీ సక్సెస్ లో మేకర్స్ ఢిల్లీలో నేడు ఓ సక్సెస్ మీట్ ని పెట్టనున్నారు. అయితే దీనికి అల్లు అర్జున్ కూడా ఆల్రెడీ అక్కడ ల్యాండ్ అయిపోయాడు.
కానీ అంతకు ముందు మాత్రం తన ఇంటి నుంచి బయలుదేరినప్పుడు తన మాతృమూర్తి నిర్మల గారితో జరిపిన చిన్నపాటి కన్వర్జేషన్ తాలూకా బ్యూటిఫుల్ పోస్ట్ ని తాను అభిమానులతో పంచుకున్నాడు. మరి తన తల్లి ఎదురుగా నిలబడి అల్లు అర్జున్ కనిపిస్తుండగా ఇద్దరూ నవ్వుకుంటూ మాట్లాడుతున్నట్టుగా ఆ ఫోటోలో ఉంది.
దీంతో ఈ బ్యూటిఫుల్ మూమెంట్ ని షేర్ చేసుకొని ఎంతో అందమైన ఈ ఉదయం మరింత అందంగా మొదలైంది అంటూ పోస్ట్ చేసాడు. దీంతో ఈ పిక్ మంచి ఫొటో మూమెంట్ గా అభిమానుల సర్కిల్ లో తిరుగుతుంది.