జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న కాలంలో.. సోషల్ మీడియా సైకోలు ఏ స్థాయిలో రెచ్చిపోయి రాజకీయ ప్రత్యర్థుల మీద అసభ్య పదజాలం, బూతులతో విరుచుకుపడ్డారో అందరికీ తెలుసు. ఈ సైకోల దురాగతాల మీద కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. వరుసగా అక్కడక్కడా కేసులు నమోదు అవుతున్నాయి. ఇలా నమోదు అవుతున్న కేసుల సంఖ్యను పరిశీలిస్తే.. సైకోలు ఎంత భారీస్థాయిలో చెలరేగిపోయారో అర్థమవుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఆరునెలల కాలంలో ఏకంగా 572 కేసులు సోషల్ మీడియాలో అసభ్య పోస్టులకు సంబంధించి నమోదు అయినట్లుగా గణాంకాలు చెబుతున్నాయి.
పోలీసులు ఈ సైకోల కేసుల్లో ఇప్పటిదాకా 210 మందిని అరెస్టు చేశారు. 175 మంది నిందితులకు నోటీసులు ఇచ్చారు. 315 మంది హ్యాండలర్స్ ను కూడా గుర్తించారు. 151 మందిపై సైబర్ బుల్లీ షీట్లను కూడా తెరిచినట్టు గణాంకాలు చెబుతున్నాయి.
ఈ గణాంకాలు పెద్ద విశేషం కాదు గానీ.. ఈ అసభ్య పోస్టుల వ్యవహారాల వెనుక ఒక వ్యవస్థీకృత నెట్ వర్క్ ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం అనే ముసుగులోనే ఈ నెట్ వర్క్ లో గతంలో పనిచేస్తూ వచ్చినట్లుగా అనుకోవాల్సి వస్తోంది. జగన్మోహన్ర రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత.. ఇదే సైకోలు అందరినీ ప్రభుత్వంలోకి కాంట్రాక్టు ఉద్యోగులుగా తీసుకున్నారు. డిజిటల్ విభాగం అనే పేరుతో వందల మందిని భారీ జీతాలతో ఉద్యోగాల్లోకి తీసుకుని వారిని ప్రభుత్వ సొమ్ముతో పోషిస్తూ.. చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్, నారాలోకేష్ తదితరుల మీద విషం కక్కడానికి వాడుకుంటూ వచ్చారని అర్థమవుతోంది.
తమాషా ఏంటంటే.. చంద్రబాబునాయుడు ప్రభుత్వం గతంలో ఉన్నప్పుడు కూడా ఇదే సోషల్ సైకోలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నానా చెత్త పోస్టులు పెడుతూ వచ్చారు. అయితే అప్పట్లో ప్రభుత్వం అంత సీరియస్ గా తీసుకోలేదు. కానీ జగన్ తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సైకోలను ప్రభుత్వం గురించి పాజిటివ్ డప్పు కొట్టడానికి మాత్రం వాడుకుని ఉంటే సరిపోయేది. అయితే వారితో ఎప్పటిలాగానే ప్రత్యర్థుల మీద విషం కక్కడానికి వాడుకున్నారు. వారి అకౌంట్లను స్వయంగా సజ్జల భార్గవ్ రెడ్డి లాంటి వాళ్లు తీసుకుని,. వారి ఖాతాల్లో వీరే పోస్టులు పెట్టే యవ్వారం కూడా నడిపించినట్లు విచారణలో వెల్లడైన సంగతి తెలిసిందే. పోలీసుశాఖ విడుదల చేసిన గణాంకాలు, విచారణల్లో బయటకు వచ్చిన వాస్తవాలు అన్నింటినీ జతచేసి చూస్తే.. పోలీసులు గుర్తించినట్టుగా ఈ సైకో పోస్టుల వెనుక ఆర్గనైజ్డ్ నెట్ వర్క్ చాలా పెద్దస్థాయిలోనే ఉన్నట్టు తెలుస్తోందని ప్రజలు అనుకుంటున్నారు.
ఆర్గనైజ్డ్ క్రైమ్ రూపంలో సోషల్ సైకోల వ్యవహారం!
Thursday, December 12, 2024