జాతీయ నటుడు అల్లు అర్జున్ తాజాగా యాక్ట్ చేసిన ‘పుష్ప-2’ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా కోసం చిత్ర యూనిట్ ఎలాంటి ప్రమోషన్స్ చేసిందో అందరికీ తెలిసిన విషయమే. ‘పుష్ప-2’ ప్రమోషన్స్‌ని పాట్నా నగరంలో నిర్వహించిన గ్రాండ్ ట్రైలర్ లాంచ్‌తో చిత్ర యూనిట్ మొదలు పెట్టింది. ఇక ఈ ఈవెంట్‌కి పాట్నాలో ఎంతమంది అభిమానులు వచ్చారో కూడా తెలిసిన విషయమే.
అయితే, ఇప్పుడు ఈ ఈవెంట్‌పై నటుడు సిద్ధార్థ్ చేసిన కామెంట్లు తాజాగా కొత్త వివాదానికి తెరతీశాయి. సిద్ధార్థ్ నటించిన తాజా సినిమా ‘మిస్ యు’ డిసెంబర్ 13న గ్రాండ్ విడుదలకు సిద్దంగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సిద్దును ‘పుష్ప-2’ పాట్నా ఈవెంట్‌కు హాజరైన ఆడియెన్స్ గురించి యాంకర్ ప్రశ్నించగా.. బీరు బిర్యానీ ఇస్తే ఎవరైనా వస్తారు.. ఇండియాలో ఇదంతా సాధారణమైన విషయం అని అన్నాడు.
దీంతో బన్నీ ఫ్యాన్స్ సిద్ధార్థ్‌పై సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు. ఆయన్ను ట్రోల్ చేస్తూ ఆయన చేసిన సినిమాలు, వాటి ఫలితాల పై ట్రోలింగ్ వీడియోలు తయారు చేస్తున్నారు.