గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు శంకర్ తో ఇద్దరి కెరీర్ లో 15వ సినిమాగా చేస్తున్న తాజా సినిమానే “గేమ్ ఛేంజర్”. మరి ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రం గురించి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఇపుడు ఈ సినిమా విడుదల దగ్గరకి వస్తుంది.
ఇక మన దేశంలో మాత్రమే కాకుండా యూఎస్ లో ఉన్న ప్రవాస తెలుగు రాష్ట్రాల జనం కూడా నార్త్ ఆడియెన్స్ కూడా గేమ్ ఛేంజర్ కోసం బాగా ఎదురు చూస్తున్నారు. మరి యూఎస్ లో గేమ్ ఛేంజర్ బుకింగ్స్ పై ఇపుడు తాజా అప్డేట్ అయితే వచ్చేసింది. అక్కడ ఈ చిత్రానికి శ్లోక ఎంటర్టైన్మెంట్స్ వారు భారీ లెవెల్లో విడుదల చేస్తుండగా ఇపుడు ఫైనల్ గా బుకింగ్స్ కి డేట్ లాక్ చేసేసారు.
అక్కడ ఈ చిత్రం డిసెంబర్ 14 నుంచి బుకింగ్స్ ఓపెన్ చేసుకోబోతుందని తెలుస్తుంది. మరి రీసెంట్ టైం లో వచ్చిన పుష్ప 2, దేవర, కల్కి 2898 ఏడీ లాంటి సినిమాలు మన స్టార్స్ నుంచి భారీ ప్రీమియర్స్ ని సెట్ చేసాయి. మరి వీటిలానే “గేమ్ ఛేంజర్” కూడా బ్లాస్ట్ చేస్తుందేమో చూడాల్సిందే.