మెగా యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సాయి దుర్గ తేజ్ హీరోగా నటించిన తాజా చిత్రాలు “బ్రో” అలాగే “విరూపాక్ష” వరుస హిట్స్ అందుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రాలు తర్వాత తాను ఓ భారీ చిత్రాన్ని తన కెరీర్ 18వ ప్రాజెక్ట్ గా యువ దర్శకుడు రోహిత్ నుంచి అనౌన్స్ చేసాడు. హను మాన్ మేకర్స్ తో ప్రకటన వచ్చినప్పటి నుంచే మంచి బజ్ నెలకొనగా ఇపుడు ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇక ఈ చిత్రం నుంచి తాజా గానే సాలిడ్ ట్రీట్ గా గ్లింప్స్ ని ఈ డిసెంబర్ 12న ఇస్తున్నట్టుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. మరి ఈ గ్యాప్ లో ఓ మెగా మాస్ అనౌన్సమెంట్ అంటూ ఇపుడు మేకర్స్ మరో తాజా అప్డేట్ అందించారు. అయితే ఈ సినిమా టీజర్ గ్లింప్స్ లాంఛ్ కి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రాబోతున్నట్టుగా బజ్ వినపడుతుంది. మరి ఇది అందుకోసమేనా అనేది చూడాలి.