మంచు వారి ఇంటి గురించి గత కొన్ని రోజులుగా రకరకాలుగా వార్తలు వినపడుతున్నాయి. ఈ క్రమంలోనే మంచు మోహన్ బాబు, మంచు మనోజ్ ఇరువురు ఒకరి మీద ఒకరు దాడులు చేసుకున్నారని, అంతేకాకుండా పోలీసులకు ఫిర్యాదులు కూడా చేశారని వార్తలు గుప్పమన్నాయి.
తన తండ్రి మోహన్ బాబు తనతో పాటు , తన భార్య మౌనిక పై కూడా దాడి చేశారని, ఆయన కొట్టడం వల్ల తీవ్రంగా గాయపడ్డాడని, ఆ గాయాలతోనే మంచు మనోజ్.. పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ కి వచ్చాడని, స్కూల్, ఆస్తుల వ్యవహారంపై ఈ గొడవ జరిగినట్లు వార్తలు రావడం ఇండస్ట్రీలో ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతుంది. తాజాగా దీనిపై మంచు ఫ్యామిలీ స్పందిస్తూ ఆ వార్తల్లో నిజం లేదని వివరించింది.
‘మోహన్ బాబు, మంచు మనోజ్ పరస్పర ఫిర్యాదులు చేసుకున్నారనే వార్తల్లో ఎలాంటి నిజం లేదు. మంచు మనోజ్ దెబ్బలతో వచ్చి మరీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్నట్లు ఊహాజనితమైన కథనాలను కొన్ని మీడియా చానెల్స్ ప్రసారం చేస్తున్నాయి. ఎలాంటి ఆధారాలు లేకుండా అసత్య ప్రచారాలను చేయకండి..’ అని మంచు ఫ్యామిలీ ఒక ప్రకటన విడుదల చేసింది.