కొత్త జంటతో అక్కినేని కుటుంబం!

Saturday, December 21, 2024

అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ వివాహం ఘనంగా జరిగింది. ఇరువురి కుటుంబ సభ్యులు, కొందరు సన్నిహితులు, పలువురు ప్రముఖుల సమక్షంలో చైతూ-శోభిత మూడు ముళ్ల బంధంతో ఒకటైన సంగతి తెలిసిందే. ఇక ఈ నూతన వధూవరులను ఆశీర్వదించారు పెళ్లికి హాజరైన వారు.

అయితే, తమ ఇంట్లో ఓ వేడుక జరుగుతుందని.. తమ కుటుంబానికి చెందిన కార్యక్రమం మాత్రమే కావడంతో ఎలాంటి మీడియా వారిని అక్కడికి ఆహ్వానించలేదు. చైతూ-శోభిత పెళ్లి అంతా సవ్యంగా జరగడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు అంటూ నాగార్జున తన సోషల్ మీడియాలో పోస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే.

ఈ సందర్భంగా కొత్త జంటతో అక్కినేని కుటుంబ సభ్యులు ఓ ఫ్యామిలీ ఫొటో తీసుకున్నారు. దీన్ని నాగార్జున సోషల్ మీడియాలో షేర్ చేయగా, అభిమానులు దీన్ని వైరల్ చేస్తూ చైతూ-శోభితకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles