విక్టరీ వెంకటేష్ – అనిల్ రావిపూడి కాంబోలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న తాజా సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా ఫస్ట్ సింగిల్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘గోదారి గట్టు మీద రామ చిలకవే’ అంటూ సాగే ఈ పాటను ఒకప్పటి ఫేమస్ సింగర్ రమణ గోగులతో పాడించింది చిత్ర బృందం.
సుమారు 18 ఏళ్ళ తర్వాత రమణ గోగుల.. వెంకటేష్ సినిమాకు పాట పాడటం మరో విశేషం. అప్పట్లో వీరి కాంబోలో వచ్చిన ప్రేమంటే ఇదేరా, లక్ష్మీ చిత్రాలు మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. అందులోని సాంగ్స్ చార్ట్ బస్టర్స్ గా నిలిచి మ్యూజిక్ లవర్స్ ని ఆకట్టుకున్నాయి.
మళ్ళీ ఇన్నేళ్లకు రమణ గోగుల గాత్రం వినిపించడంతో మ్యూజిక్ లవర్స్ ఈ సాంగ్ కోసం ఎంతో గానో ఎదురు చూస్తున్నారు.ఎలా అయితేనే నేడు ఆయన పాడిన సాంగ్ కు సంబంధించి లిరికల్ వీడియో విడుదల చేయగా.. ఈ సాంగ్ క్యాచీ లిరిక్స్ తో ఆకట్టుకునేలా ఉంది. ముఖ్యంగా రమణ గోగుల వాయిస్ ఈ పాటకు యాడ్ అవ్వడం మరింత ప్లస్ అయింది.
తెలంగాణ ఫోక్ సింగర్ మధుప్రియ రమణ గోగులతో కలిసి ఈ పాట పాడడం మరో విశేషం. ఇక ఈ పాటలో వెంకటేశ్, ఐశ్వర్య రాజేష్ ల డ్యాన్స్ సూపర్ గా ఉంది. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో వెంకటేశ్ మాజీ పోలీసు అధికారిగా కనిపించనున్నారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్ కథానాయికలుగా యాక్ట్ చేస్తున్నారు. జనవరి 14 న ఈ చిత్రం సంక్రాంతికి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తుంది.