నటసింహం బాలయ్య బాబు వారసుడు నందమూరి మోక్షజ్ఞ కథానాయకుడిగా ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ క్రేజీ సినిమా ఎప్పుడు మొదలు అవుతుంది ?, ఎప్పుడు విడుదల అవుతుంది ? అంటూ నందమూరి ఫ్యాన్స్ తెగ ఆసక్తి చూపిస్తున్నారు.
తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం జనవరి మూడో వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు కాబోతుంది. మొదటి షెడ్యూల్ లో మోక్షజ్ఞ పై ఓ పాట కి సంబంధించి కొన్ని మాంటేజ్ షాట్స్ తీయనున్నారంట.ఇప్పటికే ఈ సినిమాలో మోక్షజ్ఞ లుక్ ను మేకర్స్ రివీల్ చేయగా అది ఫ్యాన్స్ కి తెగ నచ్చేసింది.
కాగా ప్రశాంత్ వర్మ సూపర్ హీరో సినిమాటిక్ యూనివర్స్ లోనే ఈ ప్రాజెక్ట్ కూడా ఉండనుందని టాక్ నడుస్తుంది. అంటే.. ఇండియన్ మైథాలజీలో ఉన్న క్యారెక్టర్స్ బేస్ చేసుకొని ఓ సూపర్ హీరో కథతో ఈ సినిమా రాబోతుందని తెలుస్తుంది. మొత్తమ్మీద నందమూరి అభిమానులు మాత్రం ఈ సినిమా కోసం తెగ వెయిట్ చేస్తున్నారు.