మంచు ఫ్యామిలీ నుంచి మరో తరం తెరపై సందడి చేయడానికి సిద్దమైంది. ఇప్పటికే, హీరో మంచు విష్ణు కుమారుడు అవ్రామ్ ‘కన్నప్ప’లో ఓ కీలకమైన పాత్రలో యాక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు విష్ణు కుమార్తెలు అరియానా, వివియానా ఈ చిత్రంలో కనిపించనున్నట్లు మోహన్‌బాబు తాజాగా ఓ పోస్టర్ ద్వారా ప్రకటించారు.
దీనికి సంబంధించిన ఫొటోను ఆయన పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా ‘కన్నప్ప’తో నా మనవరాళ్లు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నందుకు చాలా ఆనందిస్తున్నాను. నటనపై వాళ్లకు ఉన్న అభిరుచి చూసి నాకు చాలా గర్వంగా ఉంది. పరిశ్రమలో వారికి గుర్తింపురావాలని ఎంతోమందిలో స్ఫూర్తి నింపాలని కోరుకుంటున్నా’ అంటూ మోహన్ బాబు పోస్ట్ పెట్టారు.
‘కన్నప్ప’ సినిమా విషయానికొస్తే.. మంచు విష్ణు టైటిల్ పాత్రలో ముఖేశ్ కుమార్ సింగ్ డైరెక్షన్ లో రానున్న పాన్ ఇండియా సినిమా ఇది. ఈ మూవీ ని మోహన్‌బాబు నిర్మిస్తున్నారు. ప్రీతి ముకుందన్ కథానాయిక. ప్రభాస్, అక్షయ్ కుమార్, శరత్‌కుమార్, మోహన్‌లాల్ వంటి స్టార్స్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.