2024 సెప్టెంబరు తర్వాత సరఫరా అయ్యే విద్యుత్తు కోసం 2021 డిసెంబరులోనే సెకితో ఒప్పందం చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి. ఈ ఒప్పందం అమలయ్యేనాటికి తానే మళ్లీ గెలుస్తాననే నమ్మకం ఉన్నప్పటికీ.. కొత్త ప్రభుత్వం రూపంలో ఉంటానని కూడా ఆయనకు తెలుసు. అయినా అప్పటినుంచి 25ఏళ్లకు ఏకంగా ఏడువేల మెగావాట్లు కొనడానికి అతి పెద్దడీల్ కుదుర్చుకున్నారు. ఆ డీల్ వెనుక అదానీ నుంచి 1750 కోట్ల రూపాయల లంచం తీసుకున్నారు. ఆ బేరం సంగతి తేల్చుకోవడానికి అదానీతో మూడుసార్లు ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ విషయాలన్నీ అమెరికాలోని అత్యున్నత దర్యాప్తు సంస్థ ఎఫ్‌బిఐ తమ నివేదికలో స్పష్టంగా చెప్పింది. ఈ విషయంపై రాష్ట్రంలో సహజంగానే రాద్ధాంతం జరుగుతోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద విచారణ జరగాలనే డిమాండ్లు వెల్లవెత్తుతున్నాయి. కేసులు కూడా నమోదు అవుతున్నాయి. అయితే కొంతకాలం ఇదంతాద అబద్ధాలు అంటూ బొంకడానికి ప్రయత్నించిన నీలిదళాలు ఇప్పుడు కొత్త రకం ఎత్తుగడకు దిగడం విశేషం.
తెలుగుదేశం పార్టీ గానీ, ఏపీలోని పత్రికలు,మీడియా సంస్థలు గానీ.. సెకితో ఒప్పందాల విషయంలో జగన్మోహన్ రెడ్డి లంచాలు తీసుకునే ఆరోపణలు చేయడం ద్వారా.. ప్రధాని నరేంద్రమోడీ ని భ్రష్టు పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారట. జగన్ అడ్డగోలుగా లంచాలు మేశాడు కదా అని ఆరోపణలు వస్తుండగా.. అదంతా నరేంద్రమోడీ మీద పరోక్షంగా బురద చల్లడం అవుతుందని వక్రప్రచారానికి తెర తీస్తున్నారు. ఎలాగంటే.. సెకితో ఒప్పందాల విషయంలో అదానీ ఇచ్చిన లంచాల వ్యవహారంలో జాతీయ స్థాయిలో కాంగ్రెసు పార్టీ ప్రధాని నరేంద్ర మోడీకి ముడిపెట్టి విమర్శిస్తున్నదట. ఇక్కడ తెలుగుదేశం జగన్ ను విమర్శిస్తే.. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ చేస్తున్న ప్రచారానికి మద్దతు ఇచ్చినట్టే అవుతుందిట. అంటే, ‘జగన్ తీసుకున్న లంచాల గురించి మాట్లాడడం వలన.. మోడీ భ్రష్టుపట్టిపోతారు జాగ్రత్త’ జగన్ తొత్తులు, తైనాతీలు హెచ్చరిస్తున్నట్టుగా కనిపిస్తోంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అనుచరులు, వారి వందిమాగధులు చాలా చవకబారు ఎత్తుగడలకు పాల్పడుతున్నారు. లంచాలు మేయడమే కాకుండా.. వాటిని సమర్థించుకోవడంలో ఇది ఇంకా దిగజారుడు టెక్నిక గా కనిపిస్తోంది. మోడీకి కూడా చెడ్డపేరు వస్తుంది గనుక.. మీరు మా లంచాల గురించి మాట్లాడద్దు అని అనడం వారి లేకితనానికి నిదర్శనం అని ప్రజలు అనుకుంటున్నారు.
మోడీకి ముడిపెట్టి నీలిదళాల వికృతానందం!
Sunday, December 22, 2024