షర్మిల కోరిక నెగ్గితే.. అవినాష్ కు కటకటాలే!

Thursday, January 2, 2025

తెలుగుదేశం జనసేన నాయకుల కుటుంబసభ్యుల మీద మాత్రమే కాదు. స్వయంగా జగన్మోహన్ రెడ్డి తల్లి,చెల్లి గురించి కూడా అత్యంత వివాదాస్పదమైన పోస్టులు పెట్టి హాట్ టాపిక్ గా మారిన వ్యక్తి వర్రా రవీందర్ రెడ్డి. అత్యంత నిచమైన భాషలో ఆయన పెట్టిన పోస్టులపై వైఎస్ షర్మిల గత ప్రభుత్వ కాలంలోనే పోలీసులకు ఫిర్యాదు చేసినా అతీగతీ లేకుండా పోయింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అరెస్టు అయిన  వర్రా రవీందర్ రెడ్డి.. ఐప్యాక్ నుంచి, ఎంపీ వైఎస్ అవినాస్ రెడ్డి మరియు ఆయన పీఏ రాఘవరెడ్డి నుంచి వచ్చన కంటెంట్ ను మాత్రమే తాను పోస్టు చేసేవాడిని విచారణలో వెల్లడించారు. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కూడా ఈ కేసులో నిందితుడుగా మారుతారా? ఆయన అరెస్టు కూడా జరుగుతుందా? అనే అనుమానాలు ఇప్పటికే ప్రజల్లో ఉన్నాయి.

అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు.. స్వయంగా ఈ పోస్టుల బాధితురాలు అయిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ప్రభుత్వానికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నారు. ‘అసభ్యమైన పోస్టుల వెనుక ఎంత పెద్ద తలకాయలు ఉన్నప్పటికీ.. ఏ ప్యాలెస్ లో వారు దాక్కున్నప్పటికీ.. పోలీసులు వదలొద్దు’ అంటూ ఆమె చెబుతున్న మాటలు అన్యాపదేశంగా అన్న వైఎస్ జగన్ ను ఉద్దేశించే అని పలువురు భావిస్తున్నారు. ‘పోస్టులు పెట్టిన వారిని మాత్రమే పోలీసులు అరెస్టు చేస్తున్నారు. వారి వెనక ఉన్న వారిని ఎప్పుడు అరెస్టు చేస్తారు? తెర వెనుకున్న వారిని వదిలేస్తే న్యాయం జరగదు’ అని వైఎస్ షర్మిల ఘాటుగానే డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఆమె కడప కలెక్టరును కలిసి వినతిపత్రం కూడా అందించారు.

తనతో పాటు తల్లి విజయమ్మ మీద, సోదరి సునీత మీద కూడా అసభ్య పోస్టులు పెట్టించిన వైఎస్ అవినాష్ రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. సైకో వర్రా కేసులో అవినాష్ ను అరెస్టు చేసి విచారించాలని కోరుతున్నారు. యావత్తు వైసీపీ సోషల్ మీడియాలో వచ్చిన అసభ్య తప్పుడు పోస్టులకు మూల కారణం సజ్జల భార్గవరెడ్డి కాగా, ఆయనను కూడా ఇప్పటిదాకా అరెస్టు చేయకపోవడాన్ని షర్మిల ప్రశ్నిస్తున్నారు.

షర్మిల పట్టుదల నెగ్గితే.. వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్టు కాక తప్పదని పులురు విశ్లేషిస్తున్నారు. అవినాష్ రెడ్డి తెర వెనుకనుంచి నడింపిచారని, ఆయనను అరెస్టు చేయాల్సిందేనని ఆమె డిమాండ్ చేస్తున్నారు. వర్రా వాంగ్మూలం కూడా అవినాష్ పాత్రను నిర్ధరిస్తున్న నేపథ్యంలో అరెస్టు తప్పదని పలువురు భావిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles