ఒకస్థాయికి మించిన నాయకుల మీద తాజాగా కేసులు నమోదు కావడం ప్రారంభం అయింది. ఇలాంటి సోషల్ మీడియా ముసుగులోని తప్పుడు పోస్టుల వెనుక ఎంతటి వారున్నా వదిలిపెట్టేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తొలినుంచి చెబుతూనే ఉన్నారు. ఇప్పుడు ఆ మాటలు కార్యరూపంలోకి వస్తున్నాయా? అనే అభిప్రాయం ప్రజల్లో కలుగుతోంది.
గుడివాడ మాజీ ఎమ్మెల్యే, వైఎస్షార్ కాంగ్రెస్ పార్టీలో బూతులు మాట్లాడడానికి పేటెంటు ఉన్న జగనన్నకు ప్రియమైన నేత కొడాలి నానికి, ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా దీక్షలు, నిరసనలు శాంతియుతంగా చేస్తున్నప్పుడు.. వారి మీదకు వెళ్లి నానా దుర్భాషలాడి వివాదంలోః ఇరుక్కున్న గుంటూరు నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు కి ఇప్పుడు కష్టకాలం వచ్చింది. ఈ ఇద్దరు నాయకుల మీద వేర్వేరు వ్యక్తుల ఇచ్చిన ఫిర్యాదులను బట్టి అటు విశాఖ, ఇటు గుంటూరు పోలీసులు కేసులు నమోదు చేశారు.
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తాజాగా తెదేపా నాయకుడు కనపర్తి శ్రీనివాసరావు ఫిర్యాదు చేయడంతో కావటి మనోహర్ మీద కేసు నమోదు అయింది. ఈ పరిణామాలలో అత్యంత కీలకమైన అప్డేట్ ఏమిటంటే.. రెండు మూడు రోజుల వ్యవధిలో పులివెందుల నిందితుడు వర్రా రవీందర్ రెడ్డి చెబుతున్న మాటలను అనుసరించి.. కడప ఎంపీ అవినాష్ రెడ్డిని కూడా అరెస్టు చేస్తారని పలువురు భావిస్తున్నారు.