కాకాణి గారూ.. ఏమిటి ఈ ఎక్స్‌ట్రాలు!

Tuesday, December 3, 2024

సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టిన వారు ఎంతటి వారైనా సరే.. వదలిపెట్టేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టంగా హెచ్చరించారు. ఆ మాటల ఫలితం స్పష్టంగానే కనిపిస్తోంది. నెల్లూరులో మాజీ మంత్రి కాకాణి గోవర్దనరెడ్డి మీద నమోదైన కేసుకు సంబంధించి పోలీసులు ఆయనను పిలిచి విచారించారు. కాకపోతే.. పోలీసులు విచారణకు రమ్మని అన్నప్పుడు.. కాకాణి గోవర్దన రెడ్డి.. ఎన్నికల నామినేషన్ కో, ప్రచారానికో వెళుతున్నంత ఆర్భాటంగా.. మందీమార్బలాన్ని వెంటబెట్టుకుని పెద్ద ర్యాలీగా లాగా రావడం చిత్రం! అందుకే ప్రజలు మాత్రం కాకాణి గారూ ఏమిటీ ఎక్స్‌ట్రాలు అని ఆశ్చర్యపోతున్నారు.

సోషల్ మీడియాలో తెలుగుదేశం నేతలందరిపై అసభ్య ప్రచారం జరుగుతున్నట్టుగానే.. నెల్లూరుకు చెందిన నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీద కూడా తప్పుడు ప్రచారం జరిగింది. ఆయన మీద ఆరోపణలు, కార్టూన్లు పోస్టు చేయడం కూడా జరిగింది. వాటిమీద ముత్తుకూరు పోలీసుస్టేషన్ లో కేసు నమోదు కావడంతో కాకాణిని పిలిపించి రెండున్నర గంటలపాటు విచారించారు.

మాజీ మంత్రికి ఏకంగా 54 ప్రశ్నలు సంధిస్తే.. అందులో చాలా వాటికి ఆయన కనీసం సమాధానాలే చెప్పకుండా స్కిప్ చేసినట్టు తెలుస్తోంది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన నాటినుంచి అన్ని దృష్టాంతాలను గమనిస్తున్నప్పుడు వివిధ కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్న వైసీపీ నేతలు అందరూ కూడా ఒకటే రకంగా వ్యవహరిస్తున్నారు. పోలీసులు అడిగిన ప్రశ్నకు సమాధానాలు చెప్పరు. దాటవేస్తారు. మీకెందుకు చెప్పాలి అంటారు. సమాధానం చెప్పకపోవడం ద్వారా మరింత రాద్ధాంతం చేస్తే పొలిటికల్ మైలేజీ వస్తుందని ఆశపడుతున్నట్టుగా వారందరూ కూడా వ్యవహరిస్తున్నారు.

అదంతా పక్కన పెడితే.. విచారణకు రమ్మని పోలీసులు పిలిస్తే కాకాణి గోవర్దనరెడ్డి ర్యాలీలాగా రావడమే ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆయన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. బారికేడ్లు అడ్డుపెట్టినందుకు కాకాణి అనుచరులు గొడవ చేయడంతో స్వల్ప ఉద్రిక్తత చోటు  చేసుకుంది. చివరికి కాకాణి ఒక్కరినే స్టేషను వద్దుక అనుమతించి.. పోలీసులు విచారించి పంపారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles