కాదంబరికి స్పాట్ పెట్టిన వ్యూహం బయటికొస్తుందా?

Thursday, November 14, 2024
ఏపీలో చంద్రబాబునాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. అనేకమందికి కాస్త తమ బాధలు చెప్పుకోవడానికి ధైర్యం వచ్చింది. జగన్మోహన్ రెడ్డి దుర్మార్గపు పరిపాలన సాగిన అయిదేళ్ల కాలంలో తమకు జరిగిన అన్యాయం గురించి నోరు తెరచి చెప్పుకోవడానికి వారికి అవకాశం దొరుకుతోంది. అలాంటి క్రమంలో వెలుగులోకి వచ్చిన ఒక కీలక దారుణం.. ముంబాయికి చెందిన నటి కాదంబరి జత్వానీ కేసు. నటి కాదంబరితో వివాహేతర సంబంధం కొంతకాలం కొనసాగించిన వైసీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్, ఆమె తనను మోసం చేసినట్టు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు.

ముంబాయికి విమానంలో వెళ్లి కాదంబరి జత్వానీని సకుటుంబంగా అరెస్టు చేసి తీసుకువచ్చారు. ఆతర్వాత ముంబాయిలో ఆమె మరొక పారిశ్రామిక వేత్త నవీన్ జిందాల్ పై పెట్టిన కేసు ఉపసంహరించుకోవాలని పోలీసు అధికారులు వేధించినట్టు పుకార్లు వచ్చాయి. మొత్తానికి కాదంబరి  వ్యవహారంలో పోలీసు అధికారులు  ఈస్థాయి అత్యుత్సాహం ప్రదర్శించడానికి అసలు కారణాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఆమెపై ఫిర్యాదుచేసిన వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ ను ఇప్పుడు సీఐడీ అధికారులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. సీఐడీ విచారణలో గతంలో బయటకు రాని అనేక వాస్తవాలు వెలుగులోకి వస్తాయని అంతా అనుకుంటున్నారు.

కాదంబరి జత్వానీ వ్యవహారంలో పోలీసు ఉన్నతాధికారులు ప్రదర్శించిన అత్యుత్సాహం జగన్ పాలన్ పోలీసు శాఖ ఎంతగా భ్రష్టు పట్టిపోయిందో నిరూపించే విధంగా సాగింది. సీఎం క్యాంపు ఆఫీసు నుంచి సీఐడీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు పురమాయించి ఇద్దరు సీనియర్ ఐఏఎస్ లు కాంతిరాణా తాతా, విశాల్ గున్నీలను పిలిపించి ఈకే సు అప్పగించడం జరిగింది. విశాల్ గున్నీ ఆధ్వర్యంలో పోలీసులు విమానంలో ముంబాయి వెళ్లి.. రోడ్డు మీద వెళ్తున్న కాదంబరి జత్వానీని కారుతో అటకాయించి.. అక్కడికక్కడ అదుపులోకి తీసుకుని కుటుంబం సహా తీసుకువచ్చి కేసులు పెట్టి కటకటాల వెనక్కు పంపారు. నవీన్ జిందాల్ మీద ఆమె పెట్టిన కేసు వెనక్కు తీసుకోవాలని వేధించినట్టు వార్తలొచ్చాయి.

అయితే ఈ వ్యవహారం వెనుక భారీగా కోట్లు కోట్ల రూపాయలు చేతులు మారినట్టు పుకార్లు వినిపించాయి. సజ్జల రామక్రిష్ణారెడ్డి స్వయంగా జోక్యం చేసుకుని పోలీసులను గైడ్ చేసి అంతా నడిపించినట్టు పుకార్లు వచ్చాయి. కుక్కల విద్యాసాగర్ తో పెట్టించిన కేసు చిన్నదని, అసలు వ్యూహం వేరే వున్నదని పుకార్లు వచ్చాయి. ఇప్పుడు కుక్కల సీఐడీ విచారణను ఎదుర్కొంటుండడంతో.. అసలు వాస్తవాలు అన్నీ వెలుగులోకి వస్తాయని అంతా అనుకుంటున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles