వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్క చాన్స్ అంటూ ప్రజలను బతిమాలితే.. వారు ఇచ్చిన అవకాశంతో అయిదేళ్లు పాటూ ముఖ్యమంత్రిగా రాజ్యమేలారు. తన విచ్చలవిడితనం, అరాచకత్వం, విధ్వంసక మనస్తత్వం, దుర్మార్గపు పోకడలు అన్ని షేడ్స్ ను కూడా ఆయన కేవలం అయిదేళ్లలోనే రాష్ట్రప్రజలకు పూర్తిగా రుచిచూపించారు. ఆదెబ్బతో ప్రజలంతా కూడా జడుసుకున్నారు. ఈ ఎన్నికల్లో- జగన్మోహన్ రెడ్డి ఒక సాధారణ ఎమ్మెల్యే హోదాలో మాత్రమే అయిదేళ్లు జీవించాలని వారు చాలా విస్పష్టమైన తీర్పు ఇచ్చారు. కానీ ఆ తీర్పును మాత్రం జగన్ జీర్ణించుకోలేకపోతున్నారు. తనను మామూలు ఎమ్మెల్యేగా బతకమని ప్రజలు శాసిస్తే.. తనకు కేబినెట్ మంత్రి ర్యాంకు హోదా, ఆ స్థాయి ప్రోటోకాల్ మర్యాదలు కావాలనేది ఆయన కోరిక. అందుకే తనకు ప్రతిపక్ష నాయకుడి హోదా కావాలంటూ స్పీకరుకు లేఖ రాసి.. అక్కడ పని జరగదని తెలిసి.. హైకోర్టును కూడా ఆశ్రయించి అక్కడ కూడా భంగపడడానికి ఎదురుచూస్తున్నారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తనకు ప్రతిపక్ష నాయకుడి హోదా కోసం ఏకంగా రాజ్యాంగాన్నే మార్చి రాయాలని అనుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. లేదా, ఒకసారి ముఖ్యమంత్రిగా కూడా సేవలందించిన వ్యక్తికి రాజ్యాంగంలోని నిబంధనలు, పద్ధతుల గురించి కనీస అవగాహన కూడా లేదేమో అని కూడా అనిపిస్తోంది.
ఈ నెల 11వ తేదీనుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. కేవలం 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్న పార్టీకి అధినేత జగన్ ఈ సమావేశాలకు వెళ్లకుండా దూరం ఉండాలని నిర్ణయించుకున్నారు. అందుకు ప్రజలు తనను అసహ్యించుకోకుండా కుంటిసాకులు చెప్పేందుకు ఆయన నిర్ణయించుకున్నారు. తమను శాసనసభలో ప్రజా సమస్యలు ప్రస్తావించేందుకు మైక్ ఇవ్వడం లేదని, అసలు సభకే వెళ్లడం లేదని.. సభలు జరుగుతున్న రోజుల్లో ప్రెస్ మీట్లు పెట్టి తిట్టిపోస్తూ ఉంటానని ఆయన చెబుతున్నారు.
ఇంతకూ జగన్మోహన్ రెడ్డి ఏం చెబుతున్నారో తెలుసా..? ఎన్నికల్లో 40 శాతం ఓట్లు వచ్చిన వాళ్లని ప్రతిపక్షంగా గుర్తించాలట. రాజ్యాంగంలో పది శాతం సీట్లు దక్కిన వారిని మాత్రమే ప్రతిపక్షంగా గుర్తించేలా ఉన్న నిబంధనను ఆయన తిరగరాయాలని అనుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన పార్టీకి 30 శాతం ఓట్లు, మొత్తమ్మీద నాలుగైదు సీట్లు వస్తే గనుక.. అప్పుడు కూడా.. 30 శాతం ఓట్లు వచ్చిన వారిని ప్రతిపక్షంగా గుర్తించరా? అని జగన్ రెచ్చిపోతారేమో. ప్రతిపక్ష హోదా పై అంత ఆరాటం ఎందుకంటే.. ప్రతిపక్ష నాయకుడికి మైక్ ఇస్తేనే ప్రజా సమస్యలు చెప్పే అవకాశం వస్తుందట. లేకపోతే ఉండదట. ఇదేం లాజిక్కో అర్థం కాదు. ఒక సాధారణ ఇండిపెండెంటు ఎమ్మెల్యే అయినా సరే.. ప్రజాసమస్యలను హాయిగా సభలో ప్రస్తావించడానికి హక్కు ఉంటుంది. ఆ పని చేయడానికి ప్రతిపక్ష హోదాకు లింకు జగన్ కుమాత్రమే కనిపిస్తోంది. మొత్తానికి ఆన తనకు కేబినెట్ ర్యాంకుతో ప్రతిపక్ష హోదా రావడం కోసం రాజ్యాంగాన్నే మార్చయాలని అనుకుంటున్నట్లుగా కనిపిస్తోంది.
జగన్.. రాజ్యాంగాన్ని మార్చి రాయాలనుకుంటున్నారా?
Wednesday, December 25, 2024