శివరాత్రికి వస్తున్న తమ్ముడు!

Sunday, December 22, 2024

టాలీవుడ్ హీరో నితిన్ ప్రస్తుతం వరుస సినిమాలను నిర్మిస్తూ ఫుల్‌ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే దర్శకుడు వెంకీ కుడుముల డైరెక్షన్‌లో ‘రాబిన్‌హుడ్’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు నితిన్. ఈ సినిమాను డిసెంబర్‌లో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఇక ఈ సినిమాతో పాటు మరో డైరెక్టర్ శ్రీరామ్ వేణు దర్శకత్వంలోనూ నితిన్ ‘తమ్ముడు’ అనే సినిమాలో నటిస్తున్నాడు.

అయితే, తాజాగా ‘తమ్ముడు’ సినిమా నుండి ఓ సాలిడ్ అప్డేట్‌ను మేకర్స్ ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చారు. ‘తమ్ముడు’ సినిమా రిలీజ్ డేట్‌ను మేకర్స్ లాక్ చేశారు. ఈ సినిమాను మహాశివరాత్రి కానుకగా రిలీజ్ చేయబోతున్నట్లుగా చిత్ర యూనిట్ తెలిపింది. ఈ మేరకు ఓ పోస్టర్‌ను కూడా వారు విడుదల చేశారు.

ఈ పోస్టర్‌తో ‘తమ్ముడు’ మూవీపై ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అవుతోంది. ఇక ఈ సినిమాలో లయ నితిన్ సోదరి పాత్రలో యాక్ట్‌ చేస్తున్నారు.  దీంతో ఈ సినిమాలో ఎమోషన్ ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయమని మూవీ టీమ్‌ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో వర్ష బొల్లమ్మ హీరోయిన్‌గా నటిస్తుండగా దిల్ రాజు ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles