ఆంజనేయునిగా కాంతారా హీరో!

Wednesday, October 30, 2024

ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న ‘జై హనుమాన్’ మూవీ నుంచి అక్టోబర్ 30 న ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తామని చిత్ర బృందం చెప్పిన విషయం తెలిసిందే. చెప్పినట్లుగానే తాజాగా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. అందులో హనుమంతుడి పాత్రలో ఎవరు నటిస్తున్నారో చెప్పేశారు. ఆ స్టార్ హీరో మరెవరో కాదు ‘కాంతారా’ సినిమాతో ఆడియన్స్ ను ఆకట్టుకున్న కన్నడ హీరో రిషబ్ శెట్టి.

ఫస్ట్ లుక్ లో రిష‌బ్ శెట్టి హ‌నుమంతుడి గెట‌ప్ అదిరిపోయింది. ఇందులో ఆయన హనుమంతుడిగా శ్రీరాముడి విగ్రహాన్ని హత్తుకుంటున్న లుక్ చాలా బాగుంది .’జై హనుమాన్’ లో రిషబ్ శెట్టి కూడా భాగం అవ్వడంతో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా మరింత పెరిగిపోయాయి. తేజ సజ్జా హీరోగా దర్శకుడు ప్రశాంత్‌ వర్మ తెరకెక్కించిన ‘హనుమాన్‌’ సినిమా ఈ ఏడాది సంక్రాంతికి విడుదలై అఖండ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.

దానికి కొనసాగింపుగా ‘జై హనుమాన్’ రూపుదిద్దుకుంటుంది. ‘హనుమాన్’ క్లైమాక్స్ లోనే సీక్వెల్ కు సంబంధించి హింట్ ఇచ్చారు. శ్రీరాముడికి హనుమంతుడు ఇచ్చిన మాటేమిటి?’ అనే ప్రశ్నకు సమాధానంగా ‘జై హనుమాన్‌’ రూపుదిద్దుకోనుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles