అనుమానాస్పదంగా కంగువా ఎడిటర్ మృతి!

Wednesday, October 30, 2024

కోలీవుడ్ నుంచి రాబోతున్న తాజా భారీ పాన్ ఇండియా మూవీ “కంగువా” ఒకటి. నడిప్పిన్ నాయగన్ సూర్య హీరోగా నటించిన అతి పెద్ద పాన్ ఇండియా సినిమా ఇది కాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో మేకర్స్ అంతా ఫుల్ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా తెలుగు సహా తమిళ్ లో చాలా ఈవెంట్స్ చేస్తూ సినిమాని ఆడియెన్స్ లో ఉంచుతూ ఫుల్‌ బిజీగా ఉన్నారు.

అయితే ఈ క్రమంలో చిత్ర యూనిట్ కి ఒక ఊహించని షాక్‌ తగిలింది. ఈ చిత్రానికి వర్క్ చేసిన ప్రముఖ టాలెంటెడ్ ఎడిటర్ నిషాద్ యూసుఫ్ చనిపోవడం అది కూడా అనుమానాస్పదంగా జరగడం ఒకింత సస్పెన్స్ గా మారింది. అయితే కొచ్చిలో  తన అపార్ట్మెంట్ లో యూసుఫ్‌  చనిపోయి కనిపించడం ఊహించని అంశంగా మారింది.

తాను తమిళ్ సహా మళయాళంలో పలు ఆసక్తికర సినిమాలకి పని చేశాడు. కానీ ఇపుడు ఈ రకంగా జరగడం అనేది విషాదమే.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles