ఆయన ఒక రౌడీషీటరు. ఎవరినైనా బెదిరించి సొమ్ముచేసుకుని జల్సాలు చేస్తుంటాడు. మామూలు వ్యక్తులకంటె చర్చి ఫాదర్లను బెదిరిస్తే ఈజీగా, రచ్చకెక్కకుండా డబ్బు ముడుతుందనే సీక్రెట్ ను కూడా గుర్తించిన తెలివైన రౌడీషీటరు అతను. మామూలుగా అయితే తాను ఒక కత్తి తీసుకుని వెళ్లి.. దానిని చూపించి అవతలి వారిని బెదిరించి సొమ్ము చేసుకోవాలి. అంతకంటె కాస్త ఘాటుగా ఉండాలంటే ఎలా? అని ఆలోచిస్తుండగా.. అతనికి జగనన్న ప్రభుత్వం ఒక గన్ మెన్ ను కూడా ఏర్పాటుచేసింది. అసలే రౌడీషీటరు, ఆపై గన్ మెన్.. ఇక చెలరేగిపోవడం గురించి వేరే చెప్పాలా? తాను అనుకున్నట్టే చెలరేగిపోయారు. తీరా ఒక చర్చి ఫాదరు తనను కత్తిచూపించి బెదిరించి రూ.లక్ష తీసుకువెళ్లినట్టుగా ఫిర్యాదు చేయడంతో జగనన్న పరిపాలిస్తున్న రోజుల్లోనే కేసు నమోదు అయింది. కాకపోతే.. సాహసించి ఆయన మీద దర్యాప్తు చేయలేకపోయారు పోలీసులు. తీరా ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత.. సదరు రౌడీషీటరు బాగోతం కూడా వెలుగులోకి వస్తోంది. ఇంతకూ సదరు రౌడీషీటరు ఎవరో తెలుసా.. ఆయన పేరు బోరుగడ్డ అనిల్ కుమార్! ఇటీవలే పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు.
ఒక రౌడీషీటరుకు ప్రభుత్వం గన్ మెన్ ఫెసిలిటీ కల్పించడం ఏమిటి చెప్మా అని మనకు ఆశ్చర్యం కలుగుతుంది. ఆయనను విచారిస్తున్న పోలీసులు కూడా అదే విషయం అడిగారు. తాను అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సలహాదారుగా ఉండేవాడినని, అందుకే సజ్జల రామక్రిష్ణారెడ్డి, అప్పటి నిఘా చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు ఆదేశాలతో తనకు గన్ మెన్ ఇచ్చారని బోరుగడ్డ వివరించాడు.
నిజానికి గుంటూరులోని ఏఈఎల్‌సీ చర్చి కోశాధికారి కర్లపూడి బాబుప్రకాశ్ ను బెదిరించి రూ.5 లక్షలు డిమాండ్ చేసినట్టుగా బోరుగడ్డ అనల్ కుమార మీద గుంటూరులో కేసు ఉంది. చర్చి పాస్టర్లను, ఫాదర్లను బెదిరించి డబ్బులు వసూలు చేసేవాడని, ఖరీదైన ఓల్గార్స్ కారు వాడుతుంటాడని కూడా అతనిపై ఆరోపణలున్నాయి.
అయితే పోలీసులు విచారించినప్పుడు మాత్రం అసలు బాబుప్రకాశ్ ఎవరో తనకు తెలియదని బోరుగడ్డ చెప్పడం విశేషం. అతని కార్యలయానికి వెళ్లి కత్తితో బెదిరించి రూ.లక్ష తెచ్చుకున్నావు కదా అంటే.. అసలు వ్యక్తే తనకు తెలియదని తేల్చిపారేశాడు. తన మీద ఎవరో తప్పుడు ఫిర్యాదు ఇచ్చి ఉంటారని చెప్పుకుంటున్నాడు.
ఈ రౌడీషీటరును పోలీసులు ఇంకా విచారించాల్సి ఉంది. అయితే.. ఇలాంటి ఆరోపలు ఎదుర్కొంటున్న వ్యక్తికి గన మెన్ ఉండడమే అతిపెద్ద ఆశ్చర్యం అయితే.. తాను అప్పటి సీఎం జగన్ కు సలహాదారు గనుక.. తనకు గన్ మెన్ ఇచ్చారని అతను చెప్పడం ఇంకా చిత్రం.
ఆ రౌడీషీటరు జగనన్నకు సలహదారుట!
Saturday, November 23, 2024