ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి ఒక్క తెలుగు లోనే కాకుండా దక్షిణాదిలో మరిన్ని భాషల్లో అలాగే అటు నార్త్ మార్కెట్ లో కూడా తనకి ఉన్న క్రేజ్ వేరే లెవెల్లో ఉన్న విషయం తెలిసిందే. ఇన్నేళ్ల సినిమాల్లో ఒక్క పుష్ప తప్ప మరో హిందీ రిలీజ్ కి తన సినిమా థియేట్రికల్ గా వెళ్లింది లేదు.
అయినప్పటికీ అల్లు అర్జున్ కి నార్త్ ఆడియెన్స్ లో వచ్చిన క్రేజ్ మరో హీరోకి అయితే పెద్ద కలే అని చెప్పొచ్చు.చాలా మంది యూట్యూబ్ వ్యూస్ చూసి అల్లు అర్జున్ సినిమాకి థియేటర్స్ కి ఎవరూ రారు అని పొరపాటు పడి ఉండొచ్చు.
కానీ ఇప్పుడు పుష్ప 2 పట్ల హిందీ మార్కెట్ లో నెలకొన్న హైప్ అయితే అంతా ఇంతా కాదు. అయితే ఇది అల్లు అర్జున్ బ్రాండ్ మీదే నడుస్తుండగా ఇప్పుడు నార్త్ సినిమా మార్కెట్ లో తన క్రేజ్ ఏ లెవెల్లో ఉందంటే అక్కడ వచ్చే హిందీ సినిమాలకి బన్నీ కటౌట్స్ పెట్టి సింగిల్ స్క్రీన్స్ కి జనాన్ని రప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు..
ఇది మాత్రం దక్షిణాది హీరోల్లో ఎవరికైనా చెల్లింది అంటే అది బన్నీ ఒక్కడికే సాధ్యమైందని చెప్పుకోవాలి. దీంతో హిందీ మార్కెట్ లో బన్నీ క్రేజ్ అండ్ డామినేషన్ ఏ లెవెల్లో ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఇప్పుడే ఇలా ఉంటే పుష్ప 2 విడుదల సమయానికి నార్త్ ఇండియా అంతా షేక్ అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.