ఐందామ్‌ వేదం ట్రైలర్‌ విడుదల!

Thursday, December 19, 2024

అభిరామి మీడియా వర్క్స్ బ్యానర్ మీద అభిరామి రామానాథన్, నల్లమై రామనాథన్ నిర్మించిన సినిమా ఐందామ్ వేదం. ఈ ఒరిజినల్ వెబ్ సిరీస్‌ను ఎల్. నాగరాజన్ రూపొందించారు. ఈ మూవీలో సాయి ధన్సిక, సంతోష్ ప్రతాప్, వివేక్ రాజగోపాల్, వై.జి. మహేంద్రన్, క్రిషా కురుప్, రాంజీ, దేవదర్శిని, మాథ్యూ వర్గీస్, పొన్వన్నన్ వంటి వారు ముఖ్య పాత్రలను పోషించారు. ఈ సిరీస్ జీ5 ద్వారా ప్రేక్షకుల ముందుకు అక్టోబర్ 25న రానుంది. ఈ క్రమంలో విడుదల చేసిన టీజర్ అందరినీ ఆకట్టుకుంది.

తాజాగా ఐందామ్ వేదం నుంచి ట్రైలర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చారు. ఈ ట్రైలర్‌ను మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విడుదల చేశారు.‘వెయ్యేళ్లకు ఒకసారి గురుడు, శుక్రుడు, శని, కుజుడు ఈ నాలుగు గ్రహాలు కూడా సూర్యుడ్ని చూసే విధంగా ఒకే వరుసలో రాబోతున్నాయంట.. అలా జరిగినప్పుడు అద్భుతం జరుగుతుందని చరిత్ర తెలిపింది’, ‘నాలుగు వేదాలు ఉన్నాయి.. ఐదో వేదం ఇప్పుడు బయటకు రానుంది’ అంటూ సాగిన ఈ ట్రైలర్‌లో ఎన్నో అంతు చిక్కని రహస్యాలను చూపించనున్నట్లు వివరించారు.

మర్డర్, మిస్టరీ, థ్రిల్లర్, సోషియ ఫాంటసీ ఇలా అన్నింటిని కలిపి నాగ ఈ ‘ఐందామ్ వేదం’ను అద్భుతంగా తెరకెక్కించినట్టుగా తెలుస్తుంది. ట్రైలర్‌‌లో చూపించిన విజువల్స్, ఇచ్చిన ఆర్ఆర్, భయపెట్టేలా చేసిన కెమెరా వర్క్, యాక్షన్ సీక్వెన్స్ ఇవన్నీ కూడా హైలెట్ అవుతున్నాయి. ‘ఐందామ్ వేదం’ జీ5 ఆడియెన్స్‌ను ఆకట్టుకునేందుకు ఓటీటీలోకి అక్టోబర్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అందరికీ తెలిసిన నాలుగు వేదాలు కాకుండా.. ఐదో వేదాన్ని జీ5 అందరికీ చూపించనుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles