వెన్నులో వణుకు పుట్టిస్తున్న ..!

Wednesday, October 16, 2024

మున్నా కాశి హీరోగా నటిస్తూ డైరెక్షన్‌ చేసిన మూవీ ‘సి 202’. గోవా బ్యూటీ షారోన్ రియా ఫెర్నాండెజ్ హీరోయిన్‌గా చేస్తుంది. మైటీ ఒక్ పిక్చర్స్ బ్యానర్‌పై మనోహరి కేఏ ఈ సినిమాని రూపొందించారు. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్లు, టీజర్, ట్రైలర్ ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేశాయి. ట్రైలర్‌లో ఒక్క డైలాగ్ కూడా లేకుండా.. కేవలం నటీనటుల హావభావాలతోనే అందర్ని ఆకట్టుకున్నారు.

సి 202 చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ‘ఎ’ సర్టిఫికెట్‌ను సంపాదించింది. ఇటీవలే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తవ్వడంతో చిత్ర యూనిట్ విడుదల తేదీ ప్రకటించారు. అక్టోబర్ 25న విడుదల చేస్తునట్లు ఓ పోస్టర్ రిలీజ్‌ చేశారు. ట్రైలర్‌లో ఒక్క డైలాగ్ కూడా లేకుండా సీన్స్, సౌండ్ ఎఫెక్ట్స్ తోనే భయపెట్టిన ఈ సినిమా.. మరి థియేటర్‌లో ఏ రేంజ్‌లో భయపెడుతుందో చూడాల్సిందే.

డిఫరెంట్ కాన్సెప్ట్ కథతో వస్తున్న ఈ సినిమాలో తనికెళ్ళ భరణి, శుభలేఖ సుధాకర్, సత్య ప్రకాష్, షఫీ, చిత్రం శీను, వై విజయ, అర్చన ప్రధాన పాత్రల్లో యాక్ట్‌ చేశారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles