దేవర పై తారక్‌ ఎమోషనల్‌ పోస్ట్‌!

Wednesday, December 18, 2024

సెప్టెంబర్‌ 27న థియేటర్లలోకి విడుదలైన దేవర సినిమా…తాజాగా 500 కోట్ల క్లబ్‌ లో ఎంటర్‌ అయ్యింది. ఆ తరువాత వచ్చిన సినిమాలు ఏవి కూడా దేవరని రిచ్‌ అవ్వలేకపోయాయి. దీంతో దేవర ఇంకా సక్సెస్‌ఫుల్‌ గా రన్ అవుతుంది. దీంతో.. దేవరను విజయవంతం చేసినందుకు.. ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ.. ఒక స్పెషల్ నోట్‌ను సోషల్ మీడియాలో వేదికగా పంచుకున్నాడు యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్. దేవర పార్ట్ 1’కి అందుతున్న అద్భుతమైన స్పందనకు నా హృదయపూర్వక ధన్యవాదాలు

నా సహ నటులైన సైఫ్ అలీ ఖాన్ సర్, జాన్వీ, ప్రకాష్ రాజ్ గారు, శ్రీకాంత్ గారు,  ఇతర నటీనటులకు నా శుభాకాంక్షలుతో పాటు కృతజ్ఙతలు కూడా. వారు తమ పాత్రలకు ప్రాణం పోసి, మా కథకు జీవం పోశారు. నా దర్శకుడు కొరటాల శివ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కథను సృష్టించిన ఆయన దిశానిర్దేశంతోనే ఈ ప్రాజెక్ట్ విజయవంతమైంది.

అనిరుధ్ అద్భుతమైన మ్యూజిక్‌, రత్నవేలు సర్ సినిమాటోగ్రఫి, సాబు సర్ ప్రొడక్షన్ డిజైన్, యుగంధర్ గారు వీఎఫ్ఎక్స్, శ్రీకర్ ప్రసాద్ గారు ఎడిటింగ్ తో ఈ చిత్రాన్ని అద్భుతంగా మలిచినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. మా సినిమాను విజయవంతంగా ప్రదర్శించిన పంపిణీదారులు,  థియేటర్ లో చూసిన ప్రేక్షకులకు ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే, దేశవ్యాప్తంగా ఉన్న మీడియాకు మా సినిమాను విశేషంగా ప్రోత్సహించినందుకుఅమితమైన  కృతజ్ఞతలు. మా నిర్మాతలు సుధాకర్ మిక్కిలినేని గారు ,  హరికృష్ణ కొసరాజు గారికి ఈ ప్రాజెక్ట్ను విజయవంతంగా రూపొందించినందుకు ధన్యవాదాలు.

ప్రపంచ నలుమూలల ఇంతటి ఆదరణ చూపిస్తున్న ప్రేక్షక దేవుళ్లకు నా ధన్యవాదాలు. నా కుటుంబ సభ్యులైన నా అభిమానులందరికీ, గత నెల రోజులుగా దేవర చిత్రాన్ని ఒక పండుగలా జరుపుకుంటున్నందుకు ధన్యవాదాలు చెబుతున్నాను. మీరు చూపించే ప్రేమే నన్ను ఈ స్థాయిలో నిలబెట్టింది.మీరంతా ఎలప్పుడు గర్వపడే చిత్రాలు చేస్తూనే ఉండడానికి నా శాయశక్తులా ప్రయత్నిస్తాను  అంటూ ఎన్టీఆర్ ఎమోషనల్ అయ్యారు.

https://x.com/tarak9999/status/1846129371473445366

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles