క్లైమాక్స్‌ షూట్‌ లో సంక్రాంతికి వస్తున్నాం!

Wednesday, December 18, 2024

విక్టరీ వెంకటేష్, బ్లాక్‌బస్టర్ మెషిన్ అనిల్ రావిపూడి, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ల సెన్సేషనల్ కాంబోలో క్రేజీ ఎంటర్‌టైనర్  వెంకీ అనిల్ 03 పొల్లాచ్చిలో ముఖ్యమైన షెడ్యూల్‌ను పూర్తి చేసిన తర్వాత, ప్రస్తుతం హైదరాబాద్‌లోని RFCలో న్యూ షూటింగ్ షెడ్యూల్‌ జరుగుతోంది
వెంకటేష్‌తో పాటు ప్రముఖులు నటీనటులు ఈ  షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ చిత్రంలో వెంకటేష్ భార్యగా ఐశ్వర్య రాజేష్ నటిస్తుండగా, మీనాక్షి చౌదరి ఎక్స్ లవర్ గా కనిపించబోతుంది.

ఈ ట్రై యాంగిల్ క్రైమ్ డ్రామా ని దిల్ రాజు సమర్పణలో శిరీష్ సమర్పిస్తున్నారు. కాగా ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి రెండవ వారంలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా చేస్తున్నారు మూవీ మేకర్స్. అనిల్ రావిపూడి, వెంకటేష్, దిల్ రాజు కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ సినిమాకు ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది.

దాదాపు ఆ టైటిల్ నే ఫిక్స్ చేస్తారని సమాచారం. ఈ చిత్ర షూటింగ్ 75 % పూర్తి చేసారని తెలుస్తోంది. ఓన్లీ క్లైమాక్స్ మాత్రం పెండింగ్ ఉందని సమాచారం. వచ్చే నెల అనగా నవంబరు 14 నుంచి 19 వరకు సంక్రాంతికి వస్తున్నాం క్లైమాక్స్ షూట్ ప్రారంభం కానున్నట్టు చిత్ర యూనిట్ తెలిపింది. అదే నెల 25 తో పాచ్ వర్క్ లతో సహా సినిమా మొత్తం పూర్తి చేసేలా పక్కా ప్రణాళిక రూపొందించారు నిర్మాతలు. వీలైనంత త్వరగా షూట్ కంప్లిట్ చేసి ప్రమోషన్స్ స్టార్ట్ చేయాలని చూస్తున్నారు నిర్మాత దిల్ రాజు. వెంకీ నటిస్తున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ బాలయ్య, రామ చరణ్ సినిమాలతో పోటీగా విడుదల కాబోతుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles