జగన్ మార్క్ దోపిడీకి చరమగీతం.. ఇదిగో సత్ఫలితం!

Friday, October 11, 2024

ప్రభుత్వం అనేది  ప్రభుత్వం చేయాల్సిన పనే చేయాలి. ప్రజాక్షేమాన్ని కాంక్షించి అభివృద్ధి పనులే చేపట్టాలి. కాదు కూడదు.. ఏ వ్యాపారంలో అంతో ఇంతో డబ్బులు మిగిలే అవకాశం ఉంటే ఆ వ్యాపారాలన్నీ మేమే చేస్తాం అంటే ఎలాగ? అందులో కూడా ఏ వ్యాపారాల్లో అయితే.. కేవలం డబ్బులు మిగలడం అనే మాట చెప్పడం మాత్రమే కాదు.. ఏ వ్యాపారాల రూపంలో అయితే అడ్డగోలుగా దోచుకోవడానికి అవకాశం ఉంటుందో ఆ వ్యాపారాలన్నీ మేం చేస్తాం అంటే ఎలాగ? అలాంటి దుర్మార్గమైన స్కెచ్ తో జగన్మోహన్ రెడ్డి మద్యం వ్యాపారానికి ప్రభుత్వ దుకాణాలను ఏర్పాటుచేస్తే ఆ దోపిడీ మార్గానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చరమగీతం పాడేసింది. దోపిడీ రూపుమాసిపోయింది తప్ప.. ప్రభుత్వానికి దక్కగల ఆదాయం రూపంలో ఏమీ మార్పు రావడంలేదు. గతంలో కంటె ఇంకా ఎక్కువ ఆదాయమే ప్రభుత్వం కళ్లజూసే అవకాశం కనిపిస్తోంది.

చంద్రబాబు ప్రభుత్వం కొత్త లిక్కర్ పాలసీలో మద్యం దుకాణాల నిర్వహణను ప్రెవేటు వ్యక్తులకే అప్పగించబోతున్నారు. ఇందుకోసం దరఖాస్తు చేసుకోవడానికి శుక్రవారమే ఆఖరు తేదీ. జగన్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహించేది. అందుకోసం ప్రత్యేకంగా ఉద్యోగులను నియమించింది. ఆ వ్యాపారంలో బోలెడు అవకతవకలు చోటుచేసుకుంటూ వచ్చాయి. ప్రధానంగా డిజిటల్ లావాదేవీలు అనేవి పూర్తిగా లేకపోవడంతో.. ఎంత సొమ్ము స్వాహా చేస్తున్నారో.. ఎంత సొమ్ము ప్రభుత్వానికి లెక్క చెబుతున్నారో.. ఏదీ అర్థం కాని పరిస్థితి. స్థానికంగా అధికార్లతో కుమ్మక్కు అయితే చాలు.. ఎంత బీభత్స దోపిడీ అయినా యథేచ్ఛగా చేసేసుకోవచ్చు. అలాంటివిధానం ఉండేది పైపెచ్చు.. పాపులర్ బ్రాండ్లు అన్నీ తొలగించేసి.. జగన్ బ్రాండ్లు, వైసీపీ వారు కబ్జా చేసిన మద్యం తయారీ వ్యాపారాలనుంచి వచ్చే బ్రాండ్లు మాత్రం అందుబాటులో ఉంచుతూ ఎడాపెడా దోచుకున్నారు. ఈ సకల దోపిడీ విధానాలకు చంద్రబాబు ప్రభుత్వం చరమగీతం పాడేసింది. అలాగని ప్రభుత్వాదానికి ఏమాత్రం గండిపడలేదు. ఇంకా చెప్పాలంటే.. ఆదాయం పెరిగే అవకాశం కూడా ఉంది.

కేవలం గురువారం సాయంత్రానికి నాన్ రీఫండబుల్ రుసుముల రూపేణా ప్రభుత్వానికి 1312 కోట్ల రూపాయల ఆదాయం సమకూరిందంటే.. పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. పైగా వ్యాపారం వ్యాపారం లాగానే జరుగుతుంది. ప్రభుత్వం జోక్యం వ్యాపారాన్ని నియంత్రించడం, అక్రమాలు జరగకుండా చూడడం వరకు మాత్రమే పరిమితం అవుతుంది. దీనివలన… ప్రభుత్వానికి మేలు జరుగుతుందని, అభివృద్ధి పనులపై దృష్టి పెట్టడానికి వీలవుతుందని అంతా అనుకుంటున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles