మూడేళ్లు ఫుల్‌ బిజీ!

Thursday, October 10, 2024

సినిమా ఇండస్ట్రీలో హీరో ఎవరైనా క్రేజ్‌ ఉన్నప్పుడే క్యాష్‌ చేసుకోవాలనే విషయం తెలిసిందే. డిమాండ్ ఉన్నప్పుడే వరుస ప్రాజెక్ట్స్ తో దూసుకుపోవాలి. ఇప్పుడు ఇదే స్ట్రాటజీ ఫాలో అవుతున్నాడు యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌. ఏడాదికి ఓ సినిమా రిలీజ్ చేసేలా తన  కాల్షీట్ల డైరీ ని నింపేశాడు. నిజానికి ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు ఎన్టీఆర్. రీసెంట్ గా వచ్చిన దేవర1 తో నేషనల్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్నాడు.

ఇప్పటికే ఈ సినిమా బ్రేక్ ఈవేన్ సాధించి దూసుకుపోతుంది. వీక్ డేస్ లో కూడా భారీ వసూళ్లు రాబడుతోంది. దీంతో ఫుల్ ఖుషిగా ఉన్న ఎన్టీఆర్ నెక్స్ట్ మూడు సినిమాలు చేసేందుకు తన డైరీని ఖాళీ లేకుండా నింపేశాడు. దేవర సెట్స్ పై ఉన్నప్పుడే హృతిక్ తో వార్ 2 మొదలు పెట్టేశాడు తారక్‌. ఇప్పటికే 70% షూటింగ్ పూర్తయింది. 2025 ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

వార్2 లో తన పోర్షన్ పూర్తి చేసి ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ ని మొదలు పెట్టనున్నాడు తారక్. 2026 సంక్రాంతి కి డ్రాగన్ విడుదల అని ముందే ప్రకటించారు. అంటే వచ్చే ఏడాది అక్టోబర్ లోగా షూటింగ్ పూర్తి చేసేయాలి. ఆపై దేవర 2 ని మొదలు పెట్టాడు కొరటాల శివ. ఇవి పూర్తికాకుండానే తారక్ కోసం వెయిట్ చేస్తున్న డైరెక్టర్ల లిస్ట్ రోజురోజుకి పెరిగిపోతుంది. ఎన్టీఆర్ తో ఓ సినిమా చేయడానికి ఎప్పటి నుంచో ప్రయత్నలు చేస్తున్నాడు వెట్రిమారన్.

రీసెంట్ గా తారక్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ కాంబోలో సినిమా సెట్ అయ్యే ఛాన్స్ కనపడుతుంది. అయితే వెట్రిమారన్ ప్రజెంట్ విడుదల పార్ట్ 2 చేస్తున్నాడు. తర్వాత సూర్య తో వడివాసల్ పూర్తి చేయాల్సి ఉంది. ఇక జైలర్ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ కూడా తారక్‌  కోసం ఓ కథ సిద్ధం చేశాడట. రీసెంట్ గా లైన్ కూడా చెప్పినట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్.

మొత్తానికి తారక్ డైరీ ఫుల్ అయింది. 2024 దేవర, 2025 వార్ 2, 2026 ప్రశాంత్ నీల్, 2027 దేవర 2 సినిమాలు విడుదల  చేసేలా పక్క ప్లాన్ అయితే రెడీ అయ్యింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles