ఈసారి బన్నీతో రచ్చ …రచ్చే!

Wednesday, October 9, 2024

భారత్‌ లో అది కూడా తెలుగులో మోస్ట్‌ క్రేజీయస్ట్‌ టాక్‌ షో గా బాలయ్య బాబు అన్‌స్టాపబుల్‌ షో గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటికే రెండు సీజన్లను సక్సెస్‌ ఫుల్‌ గా పూర్తి చేసుకున్న ఈ షో…మూడో సీజన్‌ మొదలు అయ్యింది. మొదటి రెండు సీజన్లు సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. యంగ్ హీరోలతో బాలయ్య చేసిన హంగామా మామూలుగా లేదు. మరి ముఖ్యంగా ప్రభాస్ ఎపిసోడ్ లో బాలయ్య, ప్రభాస్ ల అల్లరి అయితే మరి రచ్చ అసలు.

కాగా ముచ్చటగా మూడో సీజన్ UnstoppableWithNBK ఇటీవల మొదలు పెట్టారు. సీజన్ – 3 ఫస్ట్ గెస్ట్ గా మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ తో పాటు అయన నటిస్తున్న లక్కీ భాస్కర్ టీమ్ హాజరయ్యింది.ఈ నేపథ్యంలో సీజన్ -3 ఇంతకు ముందు వాటి కంటే భిన్నంగా, రెండు సీజన్స్ ను మించి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

కాగా ఇప్పుడు సెకండ్ ఎపిసోడ్ షూట్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు షో మేకర్స్.  అయితే ఈ సెకండ్ ఎపిసోడ్ లో బ్లాస్టింగ్ గెస్ట్ ఉండబోతున్నారని సమాచారం. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ ఎపిసోడ్ లో ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ గెస్ట్ గా రానున్నాడని ఓ టాక్‌ వినిపిస్తుంది. బన్నీతో పాటుగా పుష్ప 2 టీమ్ రష్మీక, సుక్కు,మైత్రి నిర్మాతలు అటెండ్ అవుతారని తెలుస్తుంది.

అలాగే రానున్న ఎపిసోడ్ లో చిరంజీవి, నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్‌, నాగ చైతన్య వంటి స్టార్ హీరోలు పాల్గొనబోతున్నట్టు సమాచారం. గతంలో వీరి ఎపిసోడ్ లో చేసిన హంగామా కంటే ఈ సారి ఆ హంగామా మరింత ఎక్కువ ఉంటుందని, అన్ స్టాపబుల్ స్టేజ్‌ పై  బాలయ్య  బన్నీ రచ్చ రచ్చ చేయనున్నారని సమాచారం.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles