ఆ హీరోయిన్‌ నాకొద్దు!

Monday, October 7, 2024

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‏ ఆలోచనల పై దర్శకుడు సూరజ్ భర్జాత్య పలు ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు.  సల్మాన్ ఖాన్ కెరీర్ లో సూపర్ హిట్ మూవీగా నిలిచిన ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’కి డైరెక్షన్‌ బాధ్యతలు చేపట్టింది కూడా సూరజ్ భర్జాత్యనే. అయితే, ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ సరసన సోనమ్ కపూర్ కథానాయికగా నటించి మెప్పించింది.

కానీ, సల్మాన్ ఖాన్ మొదట ఆమెను హీరోయిన్‏గా నిరాకరించాడట. కారణం అడిగితే.. మా మధ్య దాదాపు 20 ఏళ్ల గ్యాప్‌ ఉన్న సంగతి తెలిసిందే. అన్నిటికి కంటే ముఖ్యంగా ఆమె నా ముందే పెరిగి పెద్దదయ్యింది. తన ఎదుగుదలను నేను చూశాను. నా కూతురు లాంటి అమ్మాయితో ఎలా నటించాలి’ అని సల్మాన్ వద్దని చెప్పాడంట.

కాకపోతే, దర్శకుడు సూరజ్ భర్జాత్యకి మాత్రం ఆ పాత్రకు సోనమ్ కపూర్ అయితేనే బాగుంటుంది అని గట్టిగా నమ్మాడు. అదే విషయాన్ని సల్మాన్ తో చెప్పి చివరకు ఒప్పించాడు. షూటింగ్ లో మాత్రం ఆమెతో సీన్లు చేయాల్సి వచ్చినప్పుడల్లా సల్మాన్ ఖాన్ చాలా ఇబ్బంది పడ్డాడట. నా కూతురు లాంటి అమ్మాయితో నేను ఎలా క్లోజ్‌ గా ఆమెతో నటించాలి ? అంటూ సల్మాన్ అంటుండే వారట.

సల్మాన్ ఖాన్ ఆలోచనలు అంత సున్నితంగా ఉంటాయని డైరెక్టర్‌ సూరజ్ భర్జాత్య తెలిపాడు. ఏది ఏమైనా సల్మాన్ ఖాన్ సరసన సోనమ్ కపూర్  అయితే కథానాయికగా చాలా బాగా యాక్ట్‌ చేసింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles