జగనన్న పుంగనూరు యాత్ర : రచ్చ జరగాల్సిందే!

Monday, October 7, 2024

 మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుంగనూరు పర్యటించాలని నిర్ణయించుకున్నారు.  పుంగనూరులో హత్యకు గురైన ఏడేళ్ల బాలిక అస్పియా కుటుంబాన్ని ఆయన పరామర్శించబోతున్నారు. 9వ తేదీన పుంగనూరుకు జగన్మోహన్ రెడ్డి రానుండడంతో పోలీసులు పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా పురస్కరించును వీలైనంత పొలిటికల్ మైలేజీ  సాధించాలని,  జగన్ పుంగనూరు రాక రచ్చ రచ్చగా ఉండాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దళాలు వ్యూహరచన చేస్తున్నాయి.  ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,  ఎంపీ మిథున్ రెడ్డి స్వయంగా దగ్గరుండి అక్కడి కుట్రప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. 

తిరుమల లడ్డూ ప్రసాదానికి వినియోగించే నెయ్యిని జంతువుల వ్యర్థాలతో కల్తీ చేసిన దుర్మార్గులకు కాంట్రాక్టులను కట్టబెట్టడంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియమించిన పాలకమండలి అత్యుత్సాహం చూపించి భ్రష్టుపట్టిపోయి ఉంది. నెయ్యి  కల్తీ వ్యవహారాన్ని చాలా సీరియస్ గా తీసుకున్న సుప్రీం కోర్టు.. సీబీఐ, రాష్ట్ర పోలీసు, ఫుడ్ సేఫ్టీ అథారిటీ వారి ప్రాతినిధ్యంతో ఒక సిట్ ఏర్పాటుకు ఆదేశించింది. సిట్ విచారణలో తేలే నిజాలు తమ పార్టీకి సమాధి కట్టేస్తాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆందోళన చెందుతున్నారు. అందుకోసం డైవర్షన్ పాలిటిక్స్ మార్గం అనుసరించాలని చూస్తున్నారు. 

గతంలో జగన్ పాలన సాగుతున్న రోజుల్లో- చంద్రబాబునాయుడు పుంగనూరు మీదుగా చిత్తూరు వెళుతున్నప్పుడు ఆయనకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, శ్రేణులు రెచ్చిపోయారు. ఆయనను అడ్డుకుని నానా రభస చేశారు. ఆ సందర్భంగా ఉద్రిక్తతలు చోటుచేసుకుని, ఘర్షణలు రేగాయి. పోలీసులు చిత్రంగా చంద్రబాబునాయుడు మీదనే కేసు నమోదు చేశారు. అది చాలా పెద్దవివాదంగా మారింది. ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దళాలు మరో కుట్రకు తెరతీస్తున్నాయి. జగన్ పుంగనూరు రాక సందర్భంగా ఆయనకు తమ నిరసన తెలియజేయడానికి తెలుగుదేశం కార్యకర్తలు ప్రయత్నిస్తారని.. వారిని ప్రతిఘటించడం ద్వారా ఘర్షణలు జరిగేలా చూస్తే.. మొత్తం రాష్ట్రప్రజల దృష్టిని అటుగా మళ్లించవచ్చునని వారు భావిస్తున్నారు. తిరుమల నెయ్యి కల్తీ విషయంలో తమ పార్టీ భ్రష్టుపట్టిపోతున్నందున.. ప్రజల దృష్టిని పుంగనూరు ఘర్షణల వైపు మళ్లిస్తే లాభం జరుగుతుందని ఆశిస్తున్నారు. పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో వీరి కుట్రలు ఏమేరకు ఫలిస్తాయో వేచిచూడాలి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles