అబ్బేం అలాంటిది ఏం లేదు!

Monday, September 30, 2024

తిరుమల లడ్డూ మహా ప్రసాదం కల్తీ జరిగిందని వచ్చిన వార్తల నేపథ్యంలో మంచు విష్ణు – నటుడు ప్రకాశ్‌ రాజ్‌ ల మధ్య ట్విటర్‌  వేదికగా తీవ్ర సంభాషణ జరిగింది. తాజాగా ఈ అంశం పై మంచు విష్ణు ఓ క్లారిటీ ఇచ్చారు. నా అభిప్రాయాన్ని తెలియజేయడం కోసమే నేను ఆ పోస్ట్‌ పోస్ట్‌ చేశాను. నాకు తెలిసి అందులో ఎలాంటి కాంట్రవర్సీ లేదు.

ఇక ఆయన విషయానికి వస్తే (ప్రకాశ్‌రాజ్‌ ని ఉద్దేశించి..కానీ ఆయన పేరు ప్రస్తావించలేదు).. అది పూర్తిగా ఆయన వ్యక్తిగత అభిప్రాయం. అదే విధంగా నా అభిప్రాయాన్ని కూడా నేను చెప్పాను ‘ఒక హిందువుగా, తిరుపతి వాసిగా.. ఆ వివాదానికి మతం రంగు లేదని నేను చెప్పాలని అనుకున్నాను. అలాగే ఆయన కామెంట్స్ కూడా కరెక్ట్ కాదని చెప్పాను. నాన్నగారు నటించిన చాలా చిత్రాల్లో ఆయన నటించారు.

ఎంతోకాలం నుంచి నాకు ఆయన తెలుసు. నేను ఆయనను అంకుల్‌ అని పిలుస్తుంటాను. నాకు ఆయన అంటే గౌరవం ఉంది. మా మధ్య ఎలాంటి కాంట్రవర్సీ లేదు’ అంటూ విష్ణు చెప్పుకొచ్చాడు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles