కాదంబరి మాటతో జగన్ దళానికి పండగ!

Friday, November 22, 2024

ముంబాయి నటి, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో హాట్ టాపిక్ గా చర్చల్లో ఉన్నటువంటి కాదంబరి జత్వానీ ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, జగన్ దళాలు మొత్తం బద్ధశత్రువులా చూస్తూ వచ్చాయి. ఆమె కేరక్టర్ అసాసినేషన్ చేస్తూ విచ్చలవిడిగా తప్పుడు రాతలు రాశారు. నీచమైన రాతలురాశారు. అయితే ఇప్పుడు కాదంబరి జత్వానీ మాట్లాడిన ఒక మాటను పట్టుకుని వైఎస్సార్ కాంగ్రెస్ దళాలు అందరూ పండగ చేసుకుంటున్నారు. ఆమె చెప్పినది నిజం అంటూ ఉర్రూతలూగుతున్నారు. అయితే ఈ వెర్రి సంతోషం ద్వారా తమ గొయ్యి తామే తవ్వుకుంటున్నాం అని వారికి అర్థం కావడం లేదు.

కాదంబరి జత్వానీ హోం మంత్రిని కలిసిన తర్వాత బయటకు వచ్చి.. మీడియాతో మాట్లాడారు. ఆ సందర్భంలో ఎవరో విలేకరులు మీ కేసు విషయంలో గత ప్రభుత్వ ముఖ్యుల పాత్ర ఉందా? అంటూ ప్రశ్నించారు. దానికి సమాధానంగా కాదంబరి జత్వానీ మాట్లాడుతే తన విషయంలో పొలిటికల్ ఇన్వాల్వ్ మెంట్ పై తన దగ్గర ఎలాంటి ఆధారాలు లేవని, తన కేసు విషయంలో మేనిపులేషన్ మాత్రం జరిగిందని చెప్పారు. దీనిని రాజకీయం చేయొద్దని కోరుకుంటున్నట్టుగా ఆమె చెప్పారట. ఈ విషయాలను సాక్షి పత్రిక చాలా చాలా ప్రముఖంగా ప్రకటించింది.

అయితే ఇక్కడ తమాషా ఏంటంటే.. తన విషయంలో ఏం అన్యాయం జరిగిందో, పోలీసులు తనకు ఎలాంటి ద్రోహం చేశారో కాదంబరి జత్వానీ ఆల్రెడీ ఫిర్యాదులో చెప్పింది. ఎవరు పురమాయించగా పోలీసులు ఆ పని చేశారో ఆమె ఎలా చెబుతుంది? ఒక వేళ చెప్పినా కూడా అది ఆరోపణ మాత్రమే అవుతుంది. వాస్తవంలో ఆమె పేర్కొన్న పోలీసు అధికారుల మీద ప్రస్తుతం కేసు నమోదు అయి ఉంది. విశాల్ గున్నీ  ఇప్పటికే పలువురి సంగతులను వెల్లడించినట్టుగా కూడా తెలుస్తోంది. మిగిలిన పోలీసు అధికారుల విచారణ కూడా పూర్తయిన తర్వాత.. ఎవరికోసం వారు ఇలాంటి సాహసపు అకృత్యాలకు పాల్పడ్డారో వెలుగులోకి వస్తుంది.

కాదంబరి జత్వానీ కూడా చాలా టెక్నికల్ గా పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ గురించి తన వద్ద ఆధారాలు లేవని మాత్రమే చెప్పింది. పోలీసుల విచారణ ప్రక్రియలో అసలు సూత్రధారులందరూ వెలుగులోకి వస్తారని, తాను తొందరపడాల్సిన అవసరమేం లేదని ఆమెకు తెలుసు. అయితే కేవలం కుక్కల విద్యాసాగర్ వల్లనే ముగ్గురు ఐపీఎస్ అధికారులు అంత దూకుడుగా చూపించి ఆమెను అరెస్టు చేశారా? అనేది విచారణలో తేలితే.. వైసీపీ వారి అసహ్యమైన వ్యవహారం మొత్తం తేలుతుందని ప్రజలు అనుకుంటున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles