సల్మాన్ తో మన సత్యభామ!

Thursday, September 19, 2024

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా దర్శకుడు ఎ ఆర్ మురుగదాస్ కాంబో లో చేస్తున్న భారీ చిత్రం “సికందర్” గురించి అందరికీ తెలిసిందే. మళ్లీ చాలా కాలం తర్వాత సల్మాన్, మురుగదాస్ చేస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు ఈ సినిమాపై ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తి అవుతుండగా ఈ మూవీలో రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తుంది.

అయితే ఈ చిత్రంలో రష్మికాతో పాటుగా మరో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా చేస్తున్నట్లు రీసెంట్ గానే బజ్ వచ్చింది. అయితే ఇప్పుడు ఇది నిజం అయ్యింది. కాజల్ ఈ భారీ సినిమాలో జాయిన్ అయ్యినట్టుగా రష్మికానే తన సోషల్ మీడియాలో ఓ స్టోరీ పెట్టింది. దీంతో సత్యభామ కూడా ఈ సినిమాలో ఉందని కన్ఫర్మ్ అయ్యింది.

ఇక ఈ చిత్రానికి సల్మాన్ ఖాన్ అలాగే తన ఫ్రెండ్ సాజిద్ నదియాద్వాలా స్వయంగా నిర్మాణం వహిస్తుండగా వచ్చే ఏడాది ఈద్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles