జగన్ సర్కార్ అరాచకత్వం పై హైకోర్టు నిలతీత!

Friday, November 22, 2024

వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా అధికార వ్యవస్థలన్నింటిని తన గుప్పిట్లో పెట్టుకుని తన చేతి కీలుబొమ్మల్లాగా ఆడిస్తూ వచ్చారని ఆరోపణలు పుష్కలంగా ఉన్నాయి. ప్రధానంగా పోలీస్ యంత్రాంగాన్ని తమ ఇంటి పని వాళ్ళ లాగా వాడుకున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. హోం శాఖ మంత్రి ఎవరు? అనేదానితో నిమిత్తం లేకుండా, జగన్ తరఫున ప్రభుత్వ ప్రధాన సలహాదారు, సకల శాఖల మంత్రిగా అందరూ పిలుచుకునే సజ్జల రామకృష్ణారెడ్డి పోలీసు యంత్రాంగం మొత్తానికి సూపర్ బాస్ గా పని చేయించారనేది.. పార్టీలోని కొందరు చెప్పే విషయం. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో జగన్ సర్కారు పోలీస్ యంత్రాంగాన్ని తమ పని తాము చేసుకోనివ్వకుండా ప్రభుత్వం ప్రభావితం చేసినట్లుగా కనిపిస్తోందని హైకోర్టు వ్యాఖ్యానించడం గమనార్హం!

తెలుగుదేశం పార్టీ ఆఫీసు చంద్రబాబు నాయుడు ఇంటి మీద జరిగిన దాడుల కేసులకు సంబంధించి ఐదుగురు వైసిపి కీలక నాయకులు ఇరుక్కున్నారు. జోగి రమేష్, లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, దేవినేని అవినాష్, నందిగం సురేష్ ఈ దాడులలో కీలక పాత్ర పోషించారు. తాజాగా వారి ముందస్తు బయలు పిటిషన్లు కూడా తిరస్కరణకు గురయ్యాయి. ఒక్కరోజులో ఇద్దరు అరెస్టు కాగా ముగ్గురు పరారీలో ఉన్నారు. అయితే బెయిల్ విషయాన్ని విచారిస్తుండగా కోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. దాడులు జరిగినప్పటి నుంచి కేసు విచారణలో చోటు చేసుకున్న అసాధారణ జాప్యం గురించి హైకోర్టు ప్రశ్నించింది. ఇన్నేళ్లపాటు కేసు ఎటూ తేలకుండా ఉండిపోయింది. అంటే అప్పటి ప్రభుత్వం, ఈ కీలక నిందితులు పోలీసు వ్యవస్థను ప్రభావితం చేస్తున్నట్లుగా కనిపిస్తోందని అర్థం వచ్చేలాగా హైకోర్టు వ్యాఖ్యలు చేయడం విశేషం!

ఇప్పటికైనా సరే ఆ నాయకులను బెయిలు మీద విడిచిపెడితే వారు వ్యవస్థలనే కాదు, వ్యక్తులుగా ఉండగల సాక్షులను కూడా ప్రభావితం చేస్తారు- అనే అభిప్రాయాన్ని కోర్టు వ్యక్తీకరించడం గమనించాలి. వారు బయట ఉంటే కేసు విచారణ పద్ధతిగా సాగదు అనే ఉద్దేశంతోనే వారి బెయిలు పిటిషన్లను తిరస్కరిస్తున్నట్లుగా న్యాయమూర్తి విష్పష్టంగా పేర్కొన్నారు. జగన్ వ్యవస్థల్ని ఎలా చెప్పుచేతల్లో పెట్టుకున్నారో ఎవ్వరికీ తెలియని సంగతి కాకపోయినా, వారు ఆశ్రయించిన కేసు విషయంలోనే న్యాయస్థానం వ్యాఖ్యానించడం విశేషం.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles