విశ్వరూపం చూపించిన వరలక్ష్మి!

Thursday, September 19, 2024

పరచూరి బ్రదర్స్ మనవడు సుదర్శన్ పరుచూరి హీరోగా మిస్టర్ సెలెబ్రిటీ అనే సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో వరలక్ష్మీ శరత్ కుమార్, శ్రీ దీక్ష, నాజర్, రఘుబాబు వంటి వారు కీలక పాత్రలను పోషించగా ఈ సినిమా నుంచి తాజాగా ఓ పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చారు. వినాయక చవితి స్పెషల్‌గా మిస్టర్ సెలెబ్రిటీ నుంచి ఓ హుషారైన దైవ భక్తితో కూడిన ఓ పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చారు.

ఇప్పుడు ఎక్కడ చూసినా ఆ వినాయకుడి నామస్మరణే వినిపిస్తోండగా ఈ సినిమా కోసం ‘గజానన’ అంటూ సాగే ఈ పాటను మంగ్లీ పాడింది. గణేష్ రాసిన ఈ పాటకు వినోద్ ఇచ్చిన బాణీలు హుషారు రేపెలా ఉన్నాయి. ఇక గజానన అంటూ సాగే ఈ పాటలో వరలక్ష్మీ శరత్ కుమార్ వేసిన స్టెప్పులు అందరినీ కట్టిపడేస్తున్నాయి. చాలా రోజుల తరువాత వరలక్ష్మీ శరత్ కుమార్ ఇంత ఎనర్జీగా డ్యాన్స్ చేస్తూ అభిమానులకు కనువిందు చేసింది.

ఇక ఈ వీడియో సాంగ్‌ని చూస్తుంటే నిజంగానే వినాయక చవితి ఉత్సవాలు మొదలైయ్యాయని తెలుస్తుంది. ఇక తెరపై ఈ పాట కచ్చితంగా ఓ పండుగలా ఉంటుందని తెలుస్తుంది.  ఈ సినిమాకు చందిన రవి కిషోర్ దర్శకత్వం వహిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles