‘నీలి’ స్క్రిప్టు చదవడంలో ఎంపీ భార్య పాట్లు!

Thursday, September 19, 2024

భర్తను అరెస్టు చేయడం తప్పదు. ఒకప్పుడు రెచ్చిపోయి చేసిన నేరానికి ఇప్పుడు శిక్ష అనుభవించాల్సిందే. సాక్షాత్తూ కోర్టు కూడా ఉత్తర్వులు ఇచ్చేసిన తర్వాత.. అరెస్టు నుంచి తప్పించుకోగల ఆశలు ఉడిగిపోయాయి. ఆ భయంతోనే భర్త ఇల్లు వదలి పరారయ్యాడు. ఆమె పాపం ఆ ఆక్రోశంలో ఉంది. అలాంటి మహిళను నీలిమీడియా పలకరించి చంద్రబాబు మీద విషం కక్కమని అంటే పాపం ఆమె ఏం చెప్పగలుగుతుంది? మైకూ కెమెరా ముందుపెట్టి.. చంద్రబాబును నిందించాలంటే అప్పటికప్పుడు ఆమె ఏం మాటలు అల్లుకుంటుంది? బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ భార్య బేబీ లతకు పాపం ఇలాంటి  కష్టమే ఎదురైంది.

జగన్ అధికారంలో ఉన్న రోజుల్లో ఆయన కళ్లలో ఆనందం చూడడానికి పార్టీ నాయకులందరూ అవకాశం వస్తే చాలు యథేచ్ఛగా రెచ్చిపోతూ ఉండేవారనేది అందరికీ తెలిసినదే. ఓ సందర్భంలో ఇప్పటి స్పీకరు అయ్యన్నపాత్రుడు జగన్ మోహన్ రెడ్డి మీద తన కడుపు మంట వెళ్ల గక్కితే.. దానికి ప్రతిస్పందనగా అన్నట్టుగా వైసీపీ మూకలన్నీ తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద దాడికి తెగబడ్డాయి. తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, నందిగం సురేష్ తదితరులు తెదేపా ఆఫీసు మీద దాడిచేసిన కేసులో నిందితులు. చంద్రబాబు ఇంటిమీదకు వెళ్లి దాడిచేసిన కేసులో జోగి రమేష్ నిందితుడు. అందుకు ఆయన జగన్ వద్ద గుర్తింపును, ఆ తర్వాత మంత్రి పదవిని కూడా దక్కించుకున్నారు.

అయితే విచారణ మొదలైన తర్వాత.. వీరు ముందస్తు బెయిల్ కోసం ఆశ్రయించడం హైకోర్టు నిరాకరించడం తెలిసిందే. నందిగం సురేష్ ను అరెస్టు చేయడానికి పోలీసులు వెళితే అప్పటికే ఆయన పరారయ్యారు. అయితే నందిగం సురేష్ భార్య బేబీ లత మాత్రం నీలిమీడియాలో చంద్రబాబు మీద విషం కక్కుతున్నారు. ‘నా భర్తకు ఏమైనా హాని జరిగితే చంద్రబాబుదే బాధ్యత’ అని నీలిమీడియా వంటగాళ్లు రాసిన స్క్రిప్టును.. అందులో అర్థముందో లేదో కూడా తెలుసుకోకుండా బేబీలత వారి మైకుల ముందు వల్లెవేస్తుండడం విశేషం. ఆమె మాటల్లో కామెడీ ఏంటంటే.. వరద సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫలం అయిందిట. ఆ వైఫల్యం మీదినుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి నందిగం సురేష్ ను  అరెస్టు చేయడానికి ప్రయత్నిస్తున్నారట. ఇంకా నయ్యం.. వరదల మీదినుంచి దృష్టి మళ్లించడానికే.. హైకోర్టు తీర్పు ఇచ్చింది అని ఆ స్క్రిప్టులో రాయలేదు అని జనం జోకులు వేసుకుంటున్నారు.

నందిగం సురేష్ పై అక్రమ కేసులు బనాయించారు. వాటిపై న్యాయపోరాటం చేస్తున్నాం అని బేబీ  లత అంటున్నారు. న్యాయపోరాటం అంటే.. విచారణకు హాజరై కోర్టుకు హాజరై తమ వాదన వినిపించుకోవడం ద్వారా చేసేదని.. పరారీలో ఉండి చేసేదానిని న్యాయ కాదు మాయ పోరాటం అంటారని బేబీలత ఎప్పటికి తెలుసుకుంటారో మరి?

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles