ఏమ్మా..మీకు ప్రభుత్వం నుంచి అన్ని సదుపాయాలు అందుతున్నాయా అని ఏపీ మాజీ సీఎం జగన్ విజయవాడలో సింగ్ నగర్ కు చెందిన బాధితులను అడగగా…” ప్రతి ఇంటి దగ్గర పీకల్లోతు నీళ్లున్నాయి. వాళ్లయినా ప్రతి ఇంటికి ఎలా వస్తారు? కొంతమందికి సరుకులు పంచారు. నీళ్లలో మునుగుతూ మా వద్దకు వచ్చి పడవల సాయంతో ఒడ్డుకు తీసుకొచ్చారు”అని ఓ మహిళ చెప్పిన సమాధానం జగన్ ని షాక్ అయ్యేలా చేసింది.
విజయవాడ నగరంలోని సింగ్ నగర్ ముంపు ప్రభావిత ప్రాంతాల్లో జగన్ సోమవారం సాయంత్రం పర్యటించారు. వరద నీటిలో నడిచి బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ…విజయవాడ వరద ముప్పునకు కారణం మానవ తప్పిదమే అని విమర్శించారు. గతంలో కూడా ఈ స్థాయిలో వర్షాలు కురిశాయి. కానీ ఇంతలా విజయవాడ మునిగిపోలేదు. వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు ఉన్నా ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోలేదు.
ముంపు ప్రాంత ప్రజలకు హెచ్చరికలు చేయలేదు. అందుకే లక్షలాది మంది ప్రజలు ముంపు భారీన పడ్డారు. ఇప్పటికీ నష్ట పరిహారం ప్రకటించలేదని జగన్ విమర్శించారు.