మన టాలీవుడ్ సినిమా దగ్గర క్రేజీ మల్టీస్టారర్ చిత్రం సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లపై ఓ సినిమా పడితే చూడాలని ఎంతో మంది అనుకుంటుంటారు. మరి ఇలానే తమిళ్ సినిమా దగ్గర థలా అజిత్ అలాగే దళపతి విజయ్ ల కాంబోకి కూడా సూపర్ క్రేజ్ ఉంది. అయితే వీరిద్దరిపై మల్టీస్టారర్ చేస్తాను అని చెప్పే దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కించిన తాజా సినిమా గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం ప్రమోషన్స్ లో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు.
ఇప్పుడు తాను విజయ్ తో చేసిన గోట్ సినిమాలో అజిత్ సర్ రిఫరెన్స్ ఉండబోతుందని ఫ్యాన్స్ కి ఊహించని కిక్ ఇచ్చాడు. అలాగే ఇది అభిమానులకు మంచి సర్ప్రైజింగ్ గా ఉంటుంది అని అలాగే మరోపక్క అజిత్ చేస్తున్న తాజా సినిమా “గుడ్ బ్యాడ్ అగ్లీ” సినిమాలో విజయ్ రిఫరెన్స్ ఉంటుంది అని కోలీవుడ్ ఫ్యాన్స్ కి అదిరిపోయే అప్డేట్ ని ఇచ్చాడు. దీంతో ఈ కామెంట్స్ ఫ్యాన్స్ ని మంచి ఎగ్జెంట్ మెంట్ ని క్రియేట్ చేశాయి. మరి ఇవి సినిమాలో ఎలా ఉంటాయో వాటికి ఫ్యాన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో వేచి చూడాల్సిందే.