మోక్షజ్ఙ సినిమాలో స్టార్‌ హీరో!

Friday, December 20, 2024

నందమూరి నట సింహం బాలయ్య బాబు 50 ఏళ్ల సినీ స్వర్ణోత్సవ వేడుకలను సెప్టెంబర్‌ 1న ఎంతో వేడుకగా నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుకకు టాలీవుడ్ టాప్ హీరోలందరు హాజరుకానున్నారు. మరోవైపు నందమూరి ఫ్యాన్స్ బాలయ్య కొడుకు మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు ఉంటుందా అని చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్నారు. అదిగో ఇదిగో అని గత నాలుగైదు ఏళ్లుగా ఊరిస్తూనే ఉన్నారు తప్ప ఎంట్రీ మాత్రం లేదు.

ఇన్నాళ్లకు నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నసమయం రానే వచ్చింది. బాలయ్య ముద్దుల తనయుడు మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీకి సర్వం సిద్ధమైంది. హనుమాన్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాను తెరకెక్కించిన ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌ లో మోక్షు సినిమా రాబోతుంది. అయితే ఈ సినిమాలో బాలయ్య ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు.  ఈ వార్త నందమూరి ఫ్యాన్స్ కు పండగ అనే చెప్పాలి. ఈ చిత్ర కథ మైథలాఙికల్ టచ్ సోషియో ఫాంటసీ నేపథ్యంలో సాగుతుందని తెలుస్తుంది.

 ఈ చిత్రాన్ని మోక్షు పుట్టిన రోజు కానుకగా సెప్టెంబరు 6న ప్రకటించబోతున్నట్లు సమాచారం. నందమూరి కుటుంబానికి చెందిన రామకృష్ణ సినీ స్టూడియోస్ లో ఈ సినిమాకి సంబంధించిన పూజ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమాని ఎవరు నిర్మిస్తారు అనే క్లారిటీ అయితే ప్రస్తుతానికి లేదు. బాలయ్య చిన్న కుమార్తె తేజశ్వని ఈ సినిమాని నిర్మిస్తుందని మొదట టాక్ వినిపించింది.

కానీ తాజాగా SLV బ్యానర్ పై దసరా వంటి సినిమాలు నిర్మించిన నిర్మాత సుధాకర్ చెరుకూరి పేరు వినిపిస్తోంది. త్వరలోనే ఈ సినిమా అధికారక ప్రకటన రానుంది. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles